-
-
Home » Sports » Cricket News » IPL 2025 Rajasthan Royals vs Lucknow Super Giants Live Match Updates Score and Highlights in Telugu News NDN
-

IPL 2025, RR vs LSG: లఖ్‌నవూ థ్రిల్లింగ్ విక్టరీ.. రాజస్తాన్‌కు వరుసగా నాలుగో ఓటమి
ABN , First Publish Date - Apr 19 , 2025 | 07:16 PM
RR vs LSG IPL 2025 Live Updates in Telugu: రాజస్థాన్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ ఫైట్‌కు సంబంధించి బాల్ టు బాల్ అప్‌డేట్ మీ కోసం ఆంధ్రజ్యోతి అందిస్తోంది. అస్సలు మిస్ అవ్వకండి.

Live News & Update
-
2025-04-19T23:19:08+05:30
లఖ్‌నవూ థ్రిల్లింగ్ విక్టరీ
2 పరుగుల తేడాతో గెలుపు
రాజస్తాన్‌కు వరుసగా నాలుగో ఓటమి
ఆవేష్ ఖాన్ సూపర్ బౌలింగ్
రాణించిన యశస్వి జైస్వాల్ (74)
రియాన్ పరాగ్ (39)
వైభవ్ సూర్యవంశీ (34)
-
2025-04-19T22:42:29+05:30
15 ఓవర్లకు రాజస్తాన్ స్కోరు 135/2
క్రీజులో యశస్వి జైస్వాల్ (67), పరాగ్ (24)
విజయానికి 30 బంతుల్లో 46 పరుగులు అవసరం
-
2025-04-19T22:19:40+05:30
తొలి వికెట్ కోల్పోయిన రాజస్తాన్
వైభవ్ సూర్య వంశీ (34) అవుట్
9 ఓవర్లకు ఆర్ఆర్ స్కోరు 86/1
విజయానికి 96 బంతుల్లో 95 పరుగులు అవసరం
యశస్వి జైస్వాల్ (52 నాటౌట్) అర్ధ శతకం
-
2025-04-19T22:05:36+05:30
రాజస్థాన్ ప్రస్తుత స్కోరు 6.3 ఓవర్లలో 66.
ఆ టీమ్ చేతుల్లో 10 వికెట్లు ఉన్నాయి.
గెలుపు కోసం 81 బంతుల్లో 115 పరుగులు కావాలి.
ఓపెనర్ల ఊపు చూస్తుంటే 15 ఓవర్ల లోపే మ్యాచ్ ముగిసేలా ఉంది.
-
2025-04-19T22:05:35+05:30
రాజస్థాన్ ఓపెనర్లు రెచ్చిపోయి బ్యాటింగ్ చేస్తున్నారు.
జైస్వాల్ (24 బంతుల్లో 40 నాటౌట్), వైభవ్ సూర్యవంశీ (14 బంతుల్లో 25 నాటౌట్) చెలరేగి ఆడుతున్నారు.
జైస్వాల్-సూర్యవంశీ కలసి ఇప్పటికే 6 సిక్సులు, 4 బౌండరీలు బాదారు.
-
2025-04-19T21:47:03+05:30
లక్నో సంధించిన 180 పరుగుల ఛేదనలో రాజస్థాన్ అస్సలు తగ్గడం లేదు.
ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతున్నారు ఆర్ఆర్ బ్యాటర్లు.
రెగ్యులర్ ఓపెనర్ జైస్వాల్ (9 బంతుల్లో 18 నాటౌట్)కు తోడుగా 14 ఏళ్ల కుర్ర కెరటం వైభవ్ సూర్యవంశీ (5 బంతుల్లో 18 నాటౌట్) అదరగొడుతున్నాడు.
వైభవ్ ఇప్పటికే 1 బౌండరీ, 2 సిక్సులు బాదేశాడు.
ఎదుర్కొన్న తొలి బంతినే స్టాండ్స్‌లోకి తరలించాడు వైభవ్.
-
2025-04-19T21:27:08+05:30
లక్నో బ్యాటింగ్ ముగిసింది.
ఆ టీమ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగులు చేసింది.
ఎల్‌ఎస్‌జీలో మార్క్రమ్ (66), బదోని (50) రాణించారు. చివర్లో అబ్దుల్ సమద్ (30) అదరగొట్టాడు.
20వ ఓవర్‌లో ఏకంగా 4 సిక్సులు బాదాడు సమద్.
-
2025-04-19T21:04:04+05:30
భారీ స్కోరు దిశగా సాగుతున్న మార్క్రమ్ (66)కు హసరంగ పెవిలియన్ దారి చూపించాడు.
హాఫ్ సెంచరీతో మంచి ఊపు మీద కనిపించిన ఆయుష్ బదోని (50)ని తుషార్ దేశ్‌పాండే ఔట్ చేశాడు.
ప్రస్తుతం 18 ఓవర్లలో 5 వికెట్లకు 146 పరుగులతో ఉంది లక్నో.
-
2025-04-19T20:49:16+05:30
లక్నో బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు.
మార్క్రమ్ (40 బంతుల్లో 65 నాటౌట్), ఆయుష్ బదోని (21 బంతుల్లో 28 నాటౌట్) టీమ్ స్కోరును మూడంకెలు దాటించారు.
మార్క్రమ్-బదోని కలసి నాలుగో వికెట్‌కు ఇప్పటికే 62 పరుగులు జోడించారు.
ప్రస్తుతం లక్నో స్కోరు 14 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 116 పరుగులు.
చివరి 6 ఓవర్లలో మరింతగా గేర్లు మార్చి ఉతుకుడు ఆరంభిస్తే గానీ 180 మార్క్ వరకు లక్నో చేరుకోలేదు.
-
2025-04-19T20:19:39+05:30
లక్నో మూడో వికెట్ కోల్పోయింది.
కెప్టెన్ రిషబ్ పంత్ అలా వచ్చి ఇలా వెళ్లిపోయాడు.
3 పరుగులు చేసిన పంత్‌ను వనిందు హసరంగ ఔట్ చేశాడు.
-
2025-04-19T20:05:41+05:30
లక్నోకు మరో షాక్ తగిలింది.
6వ ఓవర్‌లో రెండో వికెట్ కోల్పోయింది ఎల్‌ఎస్‌జీ.
ఆ టీమ్ పించ్ హిట్టర్ నికోలస్ పూరన్ (11) ఔట్ అయ్యాడు.
సందీప్ శర్మ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు పూరన్.
ఇప్పుడు లక్నో స్కోరు 6.4 ఓవర్లలో 2 వికెట్లకు 50.
-
2025-04-19T19:49:17+05:30
మెరుపు ఆరంభంతో దూసుకెళ్తున్న లక్నోకు మూడో ఓవర్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
రెడ్ హాట్ ఫామ్‌లో ఉన్న మిచెల్ మార్ష్ (4)ను జోఫ్రా ఆర్చర్ ఔట్ చేశాడు.
ప్రస్తుతం 3.3 ఓవర్లో 1 వికెట్ నష్టానికి 24 పరుగులతో ఉంది ఎల్‌ఎస్‌జీ.
-
2025-04-19T19:38:37+05:30
లక్నో-రాజస్థాన్ మ్యాచ్ మొదలైపోయింది.
ఇన్నింగ్స్‌ను సాలిడ్‌గా స్టార్ట్ చేసింది ఎల్‌ఎస్‌జీ.
మార్క్రమ్ ఆరంభంలోనే రెండు ఫోర్లతో మంచి స్టార్ట్ అందించాడు.
-
2025-04-19T19:16:17+05:30
ఈ మ్యాచ్‌తో ఐపీఎల్ డెబ్యూ ఇవ్వనున్నాడు 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ.
పిన్న వయసులో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన ఆటగాడిగా వైభవ్ రికార్డు సృష్టించాడు.
-
2025-04-19T19:16:16+05:30
లక్నో సూపర్ జెయింట్స్-రాజస్థాన్ రాయల్స్ మ్యా్ మొదలైపోయింది.
టాస్ నెగ్గిన లక్నో సారథి రిషబ్ పంత్ తొలుత బ్యాటింగ్ చేయాలని డిసైడ్ అయ్యాడు.