Share News

IND vs NZ: రోహిత్‌తో పాటు అతడు మిస్.. కివీస్‌ మ్యాచ్‌కు భారత ప్లేయింగ్ 11 ఇదే..

ABN , Publish Date - Mar 01 , 2025 | 01:07 PM

India Playing 11: టీమిండియా మరో సవాల్‌కు సిద్ధమవుతోంది. ఈసారి కఠిన ప్రత్యర్థితో తలపడుతోంది. సెమీస్‌కు ముందు ఈ మ్యాచ్‌‌ను మంచి ప్రాక్టీస్‌లా వాడుకోవాలని అనుకుంటోంది.

IND vs NZ: రోహిత్‌తో పాటు అతడు మిస్.. కివీస్‌ మ్యాచ్‌కు భారత ప్లేయింగ్ 11 ఇదే..
Champions Trophy 2025

చాంపియన్స్ ట్రోఫీ-2025ను గ్రాండ్‌గా స్టార్ట్ చేసిన టీమిండియా.. వరుస విజయాలతో దూసుకెళ్తోంది. తొలుత బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన భారత్.. మలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఓ పట్టు పట్టింది. సెమీఫైనల్‌కు క్వాలిఫై అయిన రోహిత్ సేన.. చివరి లీగ్ మ్యాచ్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. రెండు జట్లు సెమీస్ చేరినందున ఇందులో గెలుపోటములతో ఎవరికీ పెద్దగా ఒరిగేదేమీ లేదు. ఈ మ్యాచ్‌ను మంచి ప్రాక్టీస్‌గా వినియోగించుకోవాలని భారత్-కివీస్ భావిస్తున్నాయి. తప్పొప్పులను సరిదిద్దుకోవడానికి ఇదే బెస్ట్ చాన్స్ అని అనుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో పోరులో భారత ప్లేయింగ్ 11 ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం..


పంత్ పక్కా..

కివీస్‌తో మ్యాచ్‌లో భారత బ్యాటింగ్‌, బౌలింగ్‌లో కలిపి రెండు కీలక మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. సారథి రోహిత్ శర్మకు రెస్ట్ ఇచ్చి అతడి స్థానంలో పించ్ హిట్టర్ రిషబ్ పంత్‌ను తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో బౌలింగ్‌లో వెటరన్ పేసర్ మహ్మద్ షమి ప్లేస్‌లో లెఫ్టార్మ్ సీమర్ అర్ష్‌దీప్ సింగ్ ఎంట్రీ ఇవ్వడం పక్కా అని తెలుస్తోంది. ఈ రెండు మార్పులతో పాటు మరో చేంజ్ కూడా జరిగే అవకాశం ఉందని వినిపిస్తోంది. న్యూజిలాండ్ టీమ్‌లో ఎక్కువ మంది లెఫ్టాండర్లు ఉన్నందున వాషింగ్టన్ సుందర్‌ను రంగంలోకి దింపాలని కోచ్ గంభీర్ భావిస్తున్నాడట. అదే జరిగితే రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌లో ఒకరు బెంచ్ మీద కూర్చోవాల్సిందే. ఈ మూడు మార్పులు తప్పితే పాకిస్థాన్‌పై ఆడిన మిగతా ప్లేయర్లంతా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

భారత జట్టు (అంచనా):

కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా/వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.


ఇవీ చదవండి:

ముంబై జోరుకు బ్రేక్‌

డబ్బుతో సంబంధం లేదు.. అందరూ ఆడొచ్చు!

మూడోరౌండ్లో ప్రజ్ఞానంద గెలుపు

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 01 , 2025 | 01:10 PM