IND vs ENG: ప్లేయింగ్ 11లోకి ఇద్దరు మాస్ బ్యాటర్లు.. ఇంగ్లండ్‌కు దబిడిదిబిడే
ABN , Publish Date - Feb 11 , 2025 | 01:15 PM
India Playing 11: ఇంగ్లండ్‌తో ఆఖరి వన్డేకు సిద్ధమవుతోంది టీమిండియా. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఈ పోరులో మరోమారు బట్లర్ సేనను చిత్తు చేయాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో మన జట్టు ప్లేయింగ్ 11 ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం..

చాంపియన్స్ ట్రోఫీకి ముందు మరో బిగ్ ఫైట్‌కు సిద్ధమవుతోంది టీమిండియా. ఇంగ్లండ్‌తో ఆఖరి వన్డేకు రెడీ అవుతోంది రోహిత్ సేన. ఫిబ్రవరి 12న జరిగే ఈ మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. మూడు వన్డేల సిరీస్‌ను ఇప్పటికే 2-0తో సొంతం చేసుకుంది భారత్. చాంపియన్స్ ట్రోఫీకి ముందు జరిగే ఆఖరి మ్యాచ్ కావడంతో ఇక్కడ గెలిచి ఆ టోర్నమెంట్‌కు మరింత కాన్ఫిడెంట్‌గా వెళ్లాలని చూస్తోంది మెన్ ఇన్ బ్లూ. ఈ నేపథ్యంలో మన జట్టు ప్లేయింగ్ 11 ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం..
బరిలోకి దిగితే విధ్వంసమే!
టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో సంచలన మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. చాంపియన్స్ ట్రోఫీకి ముందు జరిగే ఆఖరి మ్యాచ్ కావడంతో ఇక్కడ ప్రయోగాలు చేయాలని భారత టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోందట. కుర్ర బ్యాటర్లు యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకోవాలని అనుకుంటోందట. ఒకవేళ అదే జరిగితే ఇంగ్లండ్‌కు దబిడిదిబిడి ఖాయమేనని చెప్పొచ్చు. జైస్వాల్-పంత్ భారీ షాట్లతో తాండవం చేస్తే ఆపడం ఎవరి వల్లా కాదు. ఇక, తుది జట్టు కూర్పును చూస్తే.. ఓపెనర్లుగా సారథి రోహిత్‌తో కలసి జైస్వాల్ బరిలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇద్దరు ఔట్.. ఇద్దరు ఇన్!
వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తొలి రెండు వన్డేల్లో రాణించినందున అతడి ప్లేస్‌లో జైస్వాల్‌ను ప్లేయింగ్ 11లోకి తీసుకోవచ్చు. ఫస్ట్ డౌన్‌లో విరాట్ కోహ్లీ ఆడతాడు. సెకండ్ డౌన్‌లో వస్తున్న శ్రేయస్ అయ్యర్ రాణిస్తున్నందున అతడి స్థానంలో రిషబ్ పంత్‌ను రీప్లేస్ చేయొచ్చు. కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా మిడిలార్డర్ బాధ్యతలు చూసుకుంటారు. స్పిన్ ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా ఎలాగూ తుదిజట్టులో ఉంటారు. ప్రధాన స్పిన్నర్‌గా వరుణ్ చక్రవర్తి బరిలోకి దిగడం ఖాయం. యంగ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఈసారి కూడా ఆడకపోవచ్చు. అతడు పీక్ ఫామ్‌లో ఉన్నాడు.. అటు సీనియర్ స్పీడ్‌స్టర్ మహ్మద్ షమి ఇప్పుడిప్పుడే రిథమ్‌లోకి వస్తున్నాడు. కాబట్టి హర్షిత్ రాణాతో కలసి షమి పేస్ బాధ్యతలు చూసుకునే అవకాశాలు ఉన్నాయి.
భారత జట్టు (అంచనా)
రోహిత్ శర్మ (సారథి), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహ్మద్ షమి, వరుణ్ చక్రవర్తి.
ఇవీ చదవండి:
రోహిత్ వాళ్లతో జాగ్రత్త.. టీమిండియా మాజీ కోచ్ సజెషన్
కివీస్ లెజెండ్ ఊచకోత.. 49 బంతుల్లో 160 రన్స్.. ఇదేం బాదుడు సామి
సచిన్ క్రేజీ రికార్డుపై కన్నేసిన రోహిత్.. చరిత్రకు అడుగు దూరం
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి