Shubman Gill: క్యాచ్ కాదు.. కప్పు పట్టేశాడు.. గిల్‌ను ఎంత మెచ్చుకున్నా తక్కువే
ABN , Publish Date - Mar 04 , 2025 | 04:08 PM
India versus Australia Match: టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అద్భుతం చేసి చూపించాడు. ఒక్క క్యాచ్‌తో అతడు మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు.

క్యాచెస్ విన్ మ్యాచెస్ అనే నానుడి క్రికెట్‌లో బాగా వినిపిస్తూ ఉంటుంది. దీనికి కారణం క్యాచులు పట్టిన సందర్భాల్లో మ్యాచులు గెలిచినవి చాలా ఉదాహరణలు ఉన్నాయి. బౌలింగ్, బ్యాటింగ్‌తో పాటు గ్రౌండ్ ఫీల్డింగ్, క్యాచెస్ పట్టిన టీమ్‌ను విజయం వరించిన ఎగ్జాంపుల్స్ బోలెడు. ఒక్క క్యాచ్‌తో మ్యాచ్ టర్న్ అవడం కూడా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు అలా ఒక్క క్యాచ్‌తో వైరల్ అవుతున్నాడు టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్. ఆస్ట్రేలియాతో జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌తో భీకర బ్యాటర్ ట్రావిస్ హెడ్‌ను కళ్లుచెదిరే క్యాచ్‌తో సాగనంపాడు గిల్.
మెరుపు వేగంతో పరిగెత్తుతూ..
స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్‌లో రెండో బంతిని స్ట్రెయిట్ వికెట్ మీదుగా కొడదామని అనుకున్నాడు హెడ్. కానీ బంతి పిచ్ అయిన చోటు వరకు చేరుకోలేకపోయాడు. దీంతో షాట్ సరిగ్గా కనెక్ట్ కాలేదు. గాల్లోకి లేచిన బంతి లాంగాఫ్‌లో ఉన్న గిల్ మెరుపు వేగంతో పరిగెత్తుకుంటూ వచ్చి క్యాచ్ అందుకున్నాడు. దీంతో ఒక్కసారిగా భారత ఆటగాళ్లు సంబురాల్లో మునిగిపోయారు. అప్పటివరకు హెడ్ చెలరేగుతుండటంతో సైలెంట్‌గా ఉన్న భారత అభిమానులు గెలిచేశామన్నంతగా సంబురాలు చేసుకున్నారు. ఈ డిస్మిసల్ చూసిన నెటిజన్స్.. గిల్ పట్టింది క్యాచ్ కాదు.. ట్రోఫీ అని కామెంట్స్ చేస్తున్నారు.
ఇవీ చదవండి:
రాక్షసుడి ఆటకట్టు.. రివేంజ్ తీర్చుకున్న టీమిండియా
టాస్ ఓడిన రోహిత్.. మ్యాచ్ మనదే
ఈ ఆరుగురి ఆట అస్సలు మిస్సవ్వొద్దు
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి