India vs Australia: హెడ్ కోసం మాస్టర్ స్కెచ్.. ఆకలితో ఉన్న సింహాన్ని మరింత రెచ్చగొడుతున్నారు
ABN , Publish Date - Mar 04 , 2025 | 12:30 PM
Travis Head: భారత్-ఆసీస్ మధ్య కీలక పోరుకు సర్వం సిద్ధమైంది. అయితే ఎప్పటిలాగే రోహిత్ సేనకు ఓ డేంజర్ బ్యాటర్ సవాల్ విసురుతున్నాడు. అతడే ట్రావిస్ హెడ్. భారత జట్టులోని ఆకలితో ఉన్న ఒక సింహాన్ని అతడు రెచ్చగొడుతున్నాడు.

సెమీస్ కోసం సిద్ధమవుతున్న టీమిండియాకు ఓ పిచ్చోడు సవాల్ విసురుతున్నాడు. దమ్ముంటే తనను ఆపి చూడండి అంటూ చాలెంజ్ చేస్తున్నాడు. అతడే ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్. అతడు నేరుగా సవాల్ చేయకపోయినా బ్యాట్‌తో మన టీమ్ మీద ఎప్పటికప్పుడు దాడి చేస్తున్నాడు. ప్రతి బిగ్ మ్యాచ్‌లో రోహిత్ సేనను టార్గెట్ చేసి మరీ దంచుతున్నాడు. వన్డే వరల్డ్ కప్-2023 ఫైనల్‌లో విధ్వంసక ఇన్నింగ్స్‌తో మనకు కప్పును దూరం చేశాడు. ఇప్పుడూ అదే రీతిలో చెలరేగాలని భావిస్తున్నాడు. అయితే కవ్విస్తున్న హెడ్‌కు కళ్లెం వేసేందుకు ఓ సింహం మేల్కొంది.
ఊరుకునే ప్రసక్తే లేదు
హెడ్ జోరుకు బ్రేక్ వేసేందుకు రెడీ అవుతున్నాడు టీమిండియా ఏస్ పేసర్ మహ్మద్ షమి. అసలే కమ్‌బ్యాక్ తర్వాత వికెట్లు తీయాలని కసి, ఆకలితో ఉన్న షమి.. ఇప్పుడు హెడ్ మీద పడాలని చూస్తున్నాడు. స్టన్నింగ్ పేస్, అద్భుతమైన సీమ్, లైన్ అండ్ లెంగ్త్, కళ్లుచెదిరే బంతులతో అతడ్ని ఉక్కిరిబిక్కిరి చేసేందుకు రెడీ అవుతున్నాడు. వన్డే ప్రపంచ కప్-2023 ఫైనల్‌కు అతడి మీద రివేంజ్ తీర్చుకోవాలని చూస్తున్నాడు. ఈసారి హెడ్‌ను వదిలేదే లే అని భావిస్తున్నాడు. కంగారూ బ్యాటర్‌ను షమి గట్టిగా బిగించాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. షమితో పాటు భీకర ఫామ్‌లో ఉన్న మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా ఆరంభ ఓవర్లలోనే హెడ్‌ను పెవిలియన్‌కు పంపించాలని అనుకుంటున్నాడు. ఒకవేళ అతడు గానీ తర్వగా అయితే మన జట్టు ఫైనల్స్‌కు క్వాలిఫై అయినట్లే.
ఇవీ చదవండి:
భారత్-ఆసీస్ సెమీస్ ఫైట్.. వీళ్ల ఆట మిస్సవ్వొద్దు
‘లారెస్’ అవార్డుకు పంత్ నామినేట్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి