CM Revanth Reddy: కోహ్లీపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు.. సచిన్‌తో పోలిస్తే అంటూ..
ABN , Publish Date - Jan 23 , 2025 | 01:52 PM
Virat Kohli: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదు. క్రీడా రంగంతో పాటు ఇతర రంగాల వారూ అతడ్ని అభిమానిస్తుంటారు. అలాంటి విరాట్ బ్యాటింగ్ మీద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఆయన ఏమన్నారంటే..

Team India: క్రికెట్‌లో ఎవరు గ్రేట్ బ్యాటర్? ఎవరు తోపు బౌలర్? లాంటి డిస్కషన్స్ ఎప్పుడూ నడుస్తూ ఉంటాయి. ఎవరైనా కొత్త ఆటగాడు వచ్చి సంచలన ప్రదర్శనలు ఇచ్చినప్పుడు, కొన్నాళ్ల పాటు నిలకడగా రాణించినప్పుడు ఇలాంటి చర్చలు మరింత ఊపందుకుంటాయి. ముఖ్యంగా ఎవరు గొప్ప బ్యాటర్? అనే డిస్కషన్ అయితే ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, కింగ్ విరాట్ కోహ్లీ మధ్య కంపారిజన్స్ కూడా చూస్తూనే ఉన్నాం. ఇద్దరిలో ఎవరు గ్రేట్? అంటూ సోషల్ మీడియాలోనూ అనేక చర్చలు జరుగుతుంటాయి. ఈ అంశంపై తాజాగా స్పందించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన ఏమన్నారంటే..
ఇద్దరూ ఇద్దరే!
ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్‌కు వెళ్లిన సీఎం రేవంత్.. అక్కడ మీడియాతో చిట్‌చాట్‌లో భాగంగా పలు అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ఆర్థిక పురోగతితో పాటు ఇతర అంశాల మీదా స్పందించారు. మాటల్లో భాగంగా క్రికెట్ ప్రస్తావన రాగానే సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్‌తో పాటు విరాట్ కోహ్లీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు రేవంత్. ఒకవైపు సచిన్, గవాస్కర్‌ను పొగుడుతూనే మరోవైపు ఇది అతడి జమానా అంటూ విరాట్‌ను పొగడ్తల్లో ముంచెత్తారు సీఎం.
ఇది అతడి జమానా!
‘క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్ ఇద్దరూ దిగ్గజాలుగా చెప్పాలి. కానీ ఇది విరాట్ కోహ్లీ జమానా. ఈ ఆట ఎలా ఆడాలో అతడు నేర్పిస్తున్నాడు’ అని రేవంత్ చెప్పుకొచ్చారు. ఒకవైపు సచిన్ గ్రేట్ అంటూనే మరోవైపు కోహ్లీ కూడా తోపు అంటూ ఇద్దర్నీ ప్రశంసల్లో ముంచెత్తారు ముఖ్యమంత్రి. ఈ తరం కోహ్లీదేనని మెచ్చుకున్నారు. కాగా, రేవంత్ దావోస్ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆయన తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీతో రేవంత్ భేటీ అయ్యారు. తెలంగాణలో ఇన్వెస్ట్‌మెంట్‌కు గల అవకాశాలపై మీటింగ్‌లో వివరించారు.
ఇవీ చదవండి:
ఎదురులేని స్వియటెక్, సిన్నర్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి