Share News

Brazil journalist Viral Video: నదిలో లైవ్ రిపోర్టింగ్.. కాళ్ల కిందకి మృతదేహం..

ABN , Publish Date - Jul 22 , 2025 | 02:58 PM

బ్రెజిల్‌లో ఒక జర్నలిస్ట్‌కు భయానక అనుభవం ఎదురైంది. బాలిక మిస్సింగ్ కేసు గురించి నదిలోకి దిగి లైవ్‌లో రిపోర్ట్ చేస్తూ అనుకోకుండా ఆమె మృతదేహంపైనే కాలు వేశాడు. ఊహించని పరిణామానికి ఒక్కసారిగా షాక్ తిన్నాడు.

Brazil journalist Viral Video: నదిలో లైవ్ రిపోర్టింగ్.. కాళ్ల కిందకి మృతదేహం..
Brazil Journalist Steps on Missing Girl Body

Lenildo Frazao, బ్రెజిల్: బ్రెజిల్‌లో జర్నలిస్ట్‌కు భయానక అనుభవం ఎదురైంది. ఈశాన్య బ్రెజిల్‌లోని మియరిం నది ఒడ్డున ఈ భయానక ఘటన ఒక్కసారిగా అందరినీ వణికించింది. 13 ఏళ్ల స్కూల్ విద్యార్థిని అదృశ్యమైన కేసు గురించి మిరియం నదిలోకి దిగి లైవ్ రిపోర్ట్ చేస్తున్నాడు. కాసేపయ్యాక ఉన్నట్టుండి కాలు కిందకు ఏదొ వచ్చినట్టు ఒక్కసారిగా ఎగిరిపడ్డాడు. కానీ, ఆ సమయంలో తాను అడుగు వేసింది మిస్సింగ్ అయిన బాలిక మృతదేహంపైనే అని అప్పుడు అతడికి తెలియదు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.


రైస్సా అనే 13 ఏళ్ల బాలిక జూన్ 29న స్నేహితులతో కలసి మిరియం నదిలో ఈత కొడుతూ అదృశ్యమైంది. అప్పటి నుంచి ఆమె ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. ఈ ఘటనను కవర్ చేసేందుకు లెనిల్డో ఫ్రాజావో అనే రిపోర్టర్ నది వద్దకు వెళ్లాడు. నదిలోకి దిగి రిపోర్టింగ్ చేయడం మొదలుపెట్టాడు. మాట్లాడుతూనే నీటి లోతు చూపించేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో అనుకోకుండా ఏదో కాలి కిందికి వచ్చినట్టు అతడికి అనిపించి ఒక్కసారిగా భయంతో వెనక్కి జరిగాడు. నీటి అడుగున ఏదో ఉన్నట్లుంది అని తన కెమెరా టీంతో చెప్పాడు. అది చెయ్యి లాగా అనిపించిందని అన్నాడు. అది మృతదేహం అని అప్పటికి ఎవరికీ తెలియదు.


ఈ విషయాన్ని వెంటనే రెస్క్యూ బృందాలకు తెలియజేశారు. జూన్ 30న ఫైర్‌ఫైటర్లు, డైవర్లు రంగంలోకి దిగి నదిని జల్లెడ పట్టారు. ఊహించని విధంగా జర్నలిస్ట్ లెనిల్డో నిలబడిన చోటే మృతదేహం లభ్యమైంది. ఈ పరిణామం అందరినీ షాక్ కు గురి చేసింది. పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం, రైస్సా శరీరంపై ఎలాంటి గాయాలు లేవు, నీటిలో మునిగిపోవడం వల్లే ఆమె చనిపోయినట్టు తేలింది. అదే రోజు సాయంత్రం ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు.


ఇవీ చదవండి:

సింగపూర్ ఎయిర్‌పోర్టులో భారతీయుల రచ్చ.. పరువు తీసేశారంటూ జనాల ఆగ్రహం

ఇలాంటి ఇంటి ఓనర్లు కూడా ఉంటారా.. అద్దెకున్న యువకుడికి ఎలాంటి గిఫ్ట్

Read Latest and Viral News

Updated Date - Jul 22 , 2025 | 04:15 PM