Share News

Apache-64H India: భారత్‌కు అపాచీ ఎటాక్ హెలికాఫ్టర్‌లు.. తొలి దశలో మూడింటి డెలివరీ పూర్తి

ABN , Publish Date - Jul 22 , 2025 | 02:02 PM

భారత ఆర్మీ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అపాచీ ఎటాక్ హెలికాఫ్టర్‌లు ఎట్టకేలకు చేరుకున్నాయి. హిండన్ ఎయిర్‌బేస్‌లో తొలి విడతగా మూడు హెలికాఫర్ట్‌లు వచ్చాయి.

Apache-64H India: భారత్‌కు అపాచీ ఎటాక్ హెలికాఫ్టర్‌లు.. తొలి దశలో మూడింటి డెలివరీ పూర్తి
Apache helicopter India arrival

ఇంటర్నెట్ డెస్క్: భారత ఆర్మీ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అపాచీ ఎటాక్ హెలికాఫ్టర్‌లు ఎట్టకేలకు వచ్చేశాయి. తొలి దశలో భాగంగా మూడు హెలికాఫ్టర్‌లు అమెరికా మిలిటరీ ట్రాన్స్‌పోర్టు ప్లేన్‌లో హిండన్ ఎయిర్‌బేస్‌కు చేరుకున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. వీటిని పూర్తిస్థాయిలో అసెంబుల్ చేసి తనిఖీలు నిర్వహించాక ఆర్మీకి చెందిన ఏవియేషన్ కోర్ విభాగానికి అందించనున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాక వీటిని జోధ్‌పూర్‌కు తరలిస్తారు.

అపాచీ హెలికాఫ్టర్‌లు భారత్‌కు చేరుకోవడంపై ఆర్మీ హర్షం వ్యక్తం చేసింది. ఇదో ముఖ్య మైలురాయి అని కామెంట్ చేసింది. భారత అమ్ములపొదిలో అత్యాధునిక హెలికాఫ్టర్‌ల చేరికతో కార్యనిర్వాహక సామర్థ్యాలు మరింత పెరిగాయని పేర్కొంది. అపాచీ హెలికాఫ్టర్‌లతో కూడిన ప్రత్యేక స్క్వాడ్రన్‌ను గతేడాది మార్చిలోనే జోధ్‌పూర్‌లో ఏర్పాటు చేశారు.


అపాచీ ఏహెచ్-64ఈ అటాక్ హెలికాఫ్టర్‌ల కోసం 2020లో అమెరికాతో భారత ఆర్మీ 600 మిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. గతేడాది జూన్‌లో హెలికాఫ్టర్లు భారత్‌కు చేరాల్సి ఉండగా సప్లై చైన్ అవాంతరాల కారణంగా డిసెంబర్‌కు డెలివరీ తేదీని పొడిగించారు. ఇక పైలట్‌లు కూడా శిక్షణ పూర్తి చేసుకుని సిద్ధంగా ఉన్నారు. పశ్చిమ సెక్టర్‌లో కార్యకలాపాలకు ఈ హెలికాఫ్టర్‌లు భారత ఆర్మీకి అత్యంత కీలకం కానున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆపరేషన్ సిందూర్ తరువాత వీటి ప్రాముఖ్యత మరింత పెరిగింది. ఇప్పటికే భారత ఎయిర్ ఫోర్స్ వద్ద 22 అపాచీ హెలికాఫ్టర్‌లు ఉన్నాయి.


ఇవి కూడా చదవండి:

మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌కు పెన్షన్ ఎంత వస్తుందో తెలుసా

కామిక్స్ పుస్తకాల్లో కొకైన్ స్మగ్లింగ్.. బెంగళూరు ఎయిర్‌‌పోర్టులో నిందితుడి అరెస్టు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 22 , 2025 | 02:15 PM