Share News

Home Schooling : స్కూల్‌కి నో నో.. ఇంటి వద్దే చదువులు.. మారుతున్న తల్లిదండ్రుల ఆలోచనా విధానం.. ఎందుకిలా జరుగుతోంది..

ABN , Publish Date - Mar 05 , 2025 | 04:38 PM

Home Schooling Trend : తప్పనిసరి పరిస్థితుల్లోనే పిల్లలకు హోం స్కూలింగ్ ఆప్షన్ ఎంచుకుంటారు తల్లిదండ్రులు. కానీ, ఈ జనరేషన్ తల్లిదండ్రుల ఆలోచనా ధోరణి మారుతోంది. స్కూల్‌కు పంపించడం కంటే ఇంట్లోనే తమ పిల్లలకు చదువు చెప్పే పేరెంట్స్ ఎక్కువవుతున్నారు. స్కూల్ పేరెత్తితేనే నో నో అనేస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది..

Home Schooling : స్కూల్‌కి నో నో.. ఇంటి వద్దే చదువులు.. మారుతున్న తల్లిదండ్రుల ఆలోచనా విధానం.. ఎందుకిలా జరుగుతోంది..
The Homeschooling Revolution in India

Home Schooling Trend in India : తమ పిల్లలకు 2 లేదా 3 ఏళ్లు రాగానే బడికి పంపేసే తల్లిదండ్రులు మనకు చాలామందే కనిపిస్తారు. భవిష్యత్తులో బహుశా ఇలాంటి పద్ధతి కనిపించకపోవచ్చేమో. ఎందుకంటే, ప్రస్తుతం ఇండియాలో హోం స్కూలింగ్ ట్రెండ్ ఊపందుకుంటోంది. నేటి జనరేషన్ తల్లిదండ్రులు పిల్లలకు ఇంటి దగ్గరే చదువు చెప్పించేందుకు ఇష్టపడుతున్నారు. హఠాత్తుగా ఇలాంటి మార్పు ఎందుకొచ్చింది. పేరెంట్స్ పిల్లలను బడికి పంపేందుకు ఎందుకు ఇష్టపడటం లేదు. స్కూల్ పేరు ఎత్తితేనే నిస్సందేహంగా నో ఎందుకనేస్తున్నారు. అందుకు కారణాలు ఇవే అంటున్నారు విశ్లేషకులు..


క్లాస్ రూంలో చదువులొద్దు.. ఇంట్లో పాఠాలే ముద్దు..

పిల్లలు ఉన్న ఏ ఇంట్లో అయినా పొద్దున కామన్‌గా కనిపించేవి, వినిపించేవి ఇవే. స్కూల్‌కు టైం అవుతోంది. త్వరగా లే. స్నానం చేసి రెడీ అవ్వు. అని పిల్లలపై పేరెంట్స్ గట్టిగా అరుస్తుంటారు. ఇలాంటి దృశ్యాలు ఇప్పటికే చాలామంది ఇళ్లల్లో కనిపించడం లేదంటే నమ్ముతారా.. నిజంగా ఇదే నిజం. ఉదయం మేల్కొగానే హడావుడిగా స్కూల్‌కు పరుగెత్తే పిల్లలు, బలవంతంగా బిడ్డలను బడికి పంపించే తల్లిదండ్రులు ఇకపై కనిపించబోరేమో. పెయింటింగ్, ఆటలు, సింగింగ్ ఇలా ప్రశాంతంగా, ఆనందంగా తమ పిల్లలు దినచర్యను మొదలుపెట్టాలని కోరుకుంటున్నారు నేటితరం తల్లిదండ్రులు. రోజంతా బరువైన పుస్తకాలు, క్లాసుల హడావిడి మధ్య పిల్లలు నలిగిపోకూడదని ఆలోచించే పేరెంట్స్ సంఖ్య పెరుగుతోంది.


home.jpg

ఈ పద్ధతే మాకూ, పిల్లలకు మేలు..

ఇదంతా ఊహాజనితంగా అనిపిస్తుంది కదా? కానీ, ప్రస్తుతం భారతదేశంలో చాలామంది పిల్లలకు ఇది కల కాదు. నిజమే. ఎందుకంటే వారి తల్లిదండ్రులు ఇంట్లోనే బోధించే విధానాన్ని ఎంచుకున్నారు.

దీన్ని హోమ్‌స్కూలింగ్ లేదా అన్‌స్కూలింగ్ అని ఇలా ఏ పేరుతోనైనా పిలవచ్చు. నేటితరం తల్లిదండ్రులు తమ పిల్లలకు సైన్స్, గణితం లేదా ఇంగ్లీషులో మాత్రమే కాకుండా జీవితంలో ఎదిగేందుకు పాఠాలు నేర్పించాలని భావిస్తున్నారు. అది ప్రస్తుత విద్యావ్యవస్థ ద్వారా కంటే తమవల్లే సాధ్యమవుతుందని బలంగా విశ్వసిస్తున్నారు. ఈ పద్ధతి ద్వారా కఠినమైన దినచర్య, పరీక్షల ఒత్తిళ్లు పిల్లలపై పడకుండా ఉంటాయని.. తమకూ చదువు కోసం భారీ మొత్తంలో ఫీజులు చెల్లించాలనే భయమూ తప్పుతుందని అంటున్నారు.


వినటానికి అసాధారణంగా అనిపిస్తున్నా హోం స్కూలింగ్ కొత్త పద్ధతి ఏం కాదు. ఓ 50 సంత్సరాలు వెనక్కి తిరిగి చూసుకుంటే.. అప్పట్లో మన పెద్దల్లో చాలామంది ఇంటి దగ్గరే చదువు నేర్చుకున్నవారే. వీధి బళ్లో చదువు తర్వాత ప్రైవేటుగా మెట్రిక్యులేషన్ పరీక్ష పూర్తిచేసేవారు. ఆపై చదువులకు వెళ్లాలని కోరుకునే వారే కాలేజీలకు వెళ్లేవారు. తల్లిదండ్రులు హోం స్కూలింగ్ వైపు మళ్లడానికి ముఖ్య కారణం నేటి విద్యావ్యవస్థే అంటున్నారు నిపుణులు. ఆటలు, పాటలకు దూరమై ఒత్తిడితో బలవంతంగా తనువు చాలిస్తున్న పిల్లల సంఖ్య పేరెంట్స్ ఆలోచనలో మార్పు తెస్తోందని.. ఆన్‌లైన్ ద్వారానే పిల్లలకు అన్ని విషయాలను నేర్పించగలిగే అవకాశం ఉన్నప్పుడు బడికి పంపించడం ఎందుకని ప్రశ్నిస్తున్నారని అంటున్నారు. ఈ ధోరణి భవిష్యత్తులో మరింత మంది తల్లిదండ్రుల్లో పెరిగే అవకాశం లేకపోలేదు.


example.jpg

ఉదాహరణకు, గురుగ్రామ్‌కు పిల్లల పోషకాహార నిపుణురాలు ఊర్వశి ఝా సామాజిక పని ఒత్తిళ్ల కారణంగా అందరిలాగే ఇష్టంలేకపోయినా.. తన రెండున్నర సంవత్సరాల కుమార్తెను సమీపంలోని డేకేర్, ప్రీ-స్కూల్‌లో చేర్పించింది. కానీ, తర్వాత ఎవరేమనుకున్నా అనవసరమని 5 రోజుల్లోనే స్కూలు మాన్పించి హోం స్కూలింగ్ మొదలుపెట్టింది. ఈ సాంప్రదాయ విద్యా విధానం అనుసరించడం వల్ల తన పిల్లల్లో ఒత్తిడి పెరిగిపోయే అవకాశం ఉందని ఆమె కచ్చితమైన అభిప్రాయం.


Read Also : కుంభకోణం రూ.64 కోట్లు.. దర్యాప్తుకు రూ.250 కోట్లు.. మళ్లీ వార్తల్లోకి బోఫోర్స్ కేసు..

వైవాహిక బంధంలో ఈ మార్పులు కనిపిస్తే విడాకుల వైపు అడుగులేస్తున్నట్టే

ఇండియాలో ఇప్పుడిదే డ్రీమ్ బిజినెస్.. నెలకు ఎంత సంపాదనో తెలుసా?

Updated Date - Mar 05 , 2025 | 06:23 PM