Tanushree Dutta: సొంతింట్లో ఐదేళ్లుగా నరకం అనుభవిస్తున్నా.. ఏడ్చేసిన హీరోయిన్..
ABN , Publish Date - Jul 23 , 2025 | 11:10 AM
'నేను ఏ పని చేయలేకపోతున్నా.. సొంతింట్లోనే ఐదేళ్లుగా నరకం అనుభవిస్తున్నా.. నాకు ఎవరైనా సాయం చేయండి' అంటూ ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ఏడుస్తూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన వీడియో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

ఆషిక్ బనాయా ఆప్నే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బాలీవుడ్ హీరోయిన్ తొలి సినిమాతోనే ప్రేక్షకుల హృదయాలను దోచేసింది. 2018లో #MeToo ఉద్యమంలో కీలకపాత్ర పోషించి దేశవ్యాప్తంగా సెన్సేషన్ అయింది. ప్రస్తుతం సినీపరిశ్రమకు దూరంగా ఉన్న ఈ ప్రముఖ నటి వ్యక్తిగత జీవితంతో మరోసారి వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వీడియోను షేర్ చేసింది. 'నేను ఏ పని చేయలేకపోతున్నా.. సొంతింట్లోనే ఐదేళ్లుగా నరకం అనుభవిస్తున్నా.. నాకు ఎవరైనా సాయం చేయండి' అంటూ ఆమె ఏడుస్తూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన వీడియో సంచలనం రేపుతోంది.
2018 లో ప్రపంచవ్యాప్తంగా మీటూ ఉద్యమం ఊపందుకున్న సమయంలో.. ప్రముఖ నటుడు నానా పటేకర్‌పై లైంగిక ఆరోపణలు చేసి సంచలనం రేపింది హీరోయిన్ తనుశ్రీ దత్తా. నానా పటేకర్‌తో పాటు కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య, నిర్మాత సమీ సిద్ధిఖీ, దర్శకుడు రాకేష్ సారంగ్‌లపై కేసు నమోదు చేసింది. ఇప్పుడు మరోమారు వేధింపుల అంశంపైనే వార్తల్లోకి ఎక్కింది. నా ఇంట్లోనే నన్ను చిత్రహింసలు పెడుతున్నారంటూ వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన వీడియోలో ఏడుస్తూ ఆమె చెప్పిన మాటలు షాక్‌కు గురిచేస్తున్నాయి. 'గత 4-5 సంవత్సరాలుగా నా ఇంట్లోనే నన్ను వేధిస్తున్నారు. నా జీవితం నాశనమైంది. నా ఆరోగ్యం క్షీణించింది. ఇల్లంతా గందరగోళంగా ఉంది. ఏ పనీ చేయలేకపోతున్నాను. ఇంట్లో పనిమనిషిని పెట్టుకోలేను. ఇప్పటికే చాలామంది ఇంట్లో అలా పనికి చేరి దొంగతనాలు చేశారు. అందుకే నా పనులన్నీ నేనే చేసుకోవాల్సి వస్తోంది. ఇక ఇంటి బయట ఎప్పుడూ జనాలు నాపై నిఘా పెడుతున్నారు. దయచేసి, ఎవరైనా నాకు సహాయం చేయండి ' అంటూ వేడుకుంది. ఈ విషయంపై విసుగు చెంది పోలీసులు ఫోన్ చేయగా స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ చేయమన్నట్లు తను శ్రీ తెలిపింది.
ఇవి కూడా చదవండి..
నదిలో లైవ్ రిపోర్టింగ్.. కాళ్ల కిందకి మృతదేహం..
తల్లిదండ్రుల మాటలు విని భర్తకు విడాకులిచ్చి తప్పు చేశా.. మహిళ ఆవేదన నెట్టింట వైరల్
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..