Husband sends his wife: ప్రియుడితో వెళ్లిపోయిన భార్య.. ముందు జాగ్రత్తగా భర్త ఏం చేశాడంటే..
ABN , Publish Date - Jul 23 , 2025 | 10:31 AM
వేరే వ్యక్తితో ప్రేమలో పడిన మహిళలు భర్తలను చంపేస్తున్న ఘటనలు ఇటీవలి కాలంలో బాగా పెరుగుతున్నాయి. భర్తతో కలిసి హనీమూన్‌కు వెళ్లి అక్కడే అతడిని చంపించిన ఘటన నెల రోజుల క్రితం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.

ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాలు కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. వేరే వ్యక్తితో ప్రేమలో పడిన మహిళలు భర్తలను చంపేస్తున్న ఘటనలు ఇటీవలి కాలంలో బాగా పెరుగుతున్నాయి (Wife Kills Husband). భర్తతో కలిసి హనీమూన్‌కు వెళ్లి అక్కడే అతడిని చంపించిన ఘటన నెల రోజుల క్రితం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అలాగే ఢిల్లీలో, ముంబైలో కూడా ఇదే తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా ఉత్తరప్రదేశ్ (UttarPradesh)లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కేరి జిల్లా పర్సాముర్తా గ్రామానికి చెందిన జానకీ దేవి (40)కి 20 ఏళ్ల కిందట చరణ్ (47)తో వివాహం అయింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. చరణ్ ముంబైలో ఉంటూ టైల్స్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. జానకి ఇంటి దగ్గరే ఉంటూ పిల్లలను చూసుకుంటోంది. అయితే నాలుగేళ్ల క్రితం జానకికి సోను (24) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. వారి మధ్య వివాహేతర సంబంధం మొదలైంది. భర్త వేరే ఊరిలో ఉండడంతో సోనూ, జానకి ఒకే ఇంట్లో కలిసి నివసించడం మొదలుపెట్టారు.
విషయం తెలుసుకున్న చరణ్.. భార్యను నిలదీయడంతో ఆమె క్షమాపణ చెప్పి తిరిగి భర్త దగ్గరకు వచ్చేసింది. కొన్ని నెలల తర్వాత జానకి తన భర్తను వదిలేసి మళ్లీ ప్రియుడి దగ్గరకే వెళ్లిపోయింది. దీంతో చరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే గత సోమవారం ఆ ఫిర్యాదును వెనక్కి తీసుకున్నాడు. తన భార్య తన ప్రియుడితో ఉండడంలో తనకెలాంటి అభ్యంతరమూ లేదని, తనకు ఆమెతో ఎలాంటి సంబంధమూ లేదని రాతపూర్వకంగా ఒప్పంద పత్రాన్ని పోలీసులకు అందించాడు. భార్య తన ప్రియుడితో కలిసి తనను ఏమైనా చేస్తుందేమోననే భయంతోనే ఇలా చేసినట్టు చరణ్ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి..
ముఖేష్, నీతా రేర్ ఫొటో.. పెళ్లి నాటికి వీరు ఎలా ఉన్నారో చూడండి..
స్లిమ్‌గా మారేందుకు రెండు వారాల డైట్.. ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్‌కు చైనా యువతి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..