Share News

Mukesh and Nita Ambani: ముఖేష్, నీతా రేర్ ఫొటో.. పెళ్లి నాటికి వీరు ఎలా ఉన్నారో చూడండి..

ABN , Publish Date - Jul 23 , 2025 | 09:49 AM

పెళ్లి సమయంలో ముఖేష్, నీతా చాలా సింపుల్‌గా కనిపిస్తున్నారు. ఎలాంటి హంగూ, ఆర్భాటం లేకుండా ఓ ఎరుపు రంగు చీర కట్టుకుని నీతా ముస్తాబయ్యారు. ముఖేష్ తెలుపు రంగు దుస్తులు ధరించారు. ఈ ఫొటో ఇప్పటివరకు బయటకు రాలేదు.

Mukesh and Nita Ambani: ముఖేష్, నీతా రేర్ ఫొటో.. పెళ్లి నాటికి వీరు ఎలా ఉన్నారో చూడండి..
Mukesh and Nita Rare Photo

ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆసియాలోనే నెంబర్ వన్ ధనవంతుడు అయిన ముఖేష్ అంబానీ (Mukesh Ambani) పెళ్లి ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జానపద నృత్యకళాకారిణి అయిన నీతా అంబానీ (Nita Ambani)ని తల్లిదండ్రుల అంగీకారంతో ముఖేష్ ప్రేమ వివాహం చేసుకున్నారు. 1985లో ముఖేష్, నీతా వివాహం జరిగింది. ఆ సమయంలో తీసిన ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియా జనాలను ఆకట్టుకుంటోంది (Mukesh and Nita Rare Photo).


పెళ్లి సమయంలో ముఖేష్, నీతా చాలా సింపుల్‌గా కనిపిస్తున్నారు. ఎలాంటి హంగూ, ఆర్భాటం లేకుండా ఓ ఎరుపు రంగు చీర కట్టుకుని నీతా ముస్తాబయ్యారు. ముఖేష్ తెలుపు రంగు దుస్తులు ధరించారు. ఈ ఫొటో ఇప్పటివరకు బయటకు రాలేదు. ఈ ఫొటోను తాజాగా రిలయన్స్ ఫౌండేషన్ నేతృత్వంలోని స్వదేశ్‌ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. భారతీయ చేనేత కళలను ప్రోత్సహిస్తూ ఈ ఫొటోను షేర్ చేశారు. 1985 నాటి వివాహ ఆచారాలను ఆ పోస్ట్‌లో పంచుకున్నారు.


నీతా అంబానీ అందమైన మధురై కాటన్ ఘర్చోలా చీరను ధరించి పవిత్ర పూజలో పాల్గొన్నారని, దీనిని రాజ్‌సుందర్ అనే శిల్పకారుడు 10 నెలల పాటు చేతితో నేశారట. కాగా, ముఖేష్, నీతా దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరి ముగ్గురికీ పెళ్లిళ్లు అయిపోయాయి. నీతా ప్రస్తుతం రిలయన్స్ ఫౌండేషన్ సారథిగా పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

ఆ పిల్లి ప్రమాదాన్ని ఎలా పసిగట్టిందో చూడండి.. యజమానిని కాపాడి..


మీ చూపు షార్ప్ అయితే.. ఈ గడ్డిలో పాము ఎక్కడుందో 7 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 23 , 2025 | 12:45 PM