Python VS Leopard: పులిని మింగాలని చూసిన కొండచిలువ.. చివరికి జరిగింది చూస్తే అవాక్కవ్వాల్సిందే..
ABN , Publish Date - May 11 , 2025 | 10:20 AM
ఆకలితో ఉన్న ఓ పెద్ద కొండచిలువకు పులి కనిపిస్తుంది. దాన్ని చూడగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా దాడికి దిగింది. పులి తలను పట్టుకుని మింగేందుకు ప్రయత్నించింది. కొండచిలువ నుంచి తప్పించుకోవాలని పులి ఎంత ప్రయత్నించినా దాని వల్ల సాధ్యం కాలేదు. అయితే చివరకు ఎవరూ ఊహించని విధంగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..

కొండచిలువకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో అనేకం వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు పెద్ద పెద్ద మొసళ్లకు సైతం కొండచిలువలు చుక్కలు చూపిస్తుంటాయి. మరికొన్నిసార్లు ఏనుగులను సైతం భయంతో పరుగెత్తేలా చేస్తుంటాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. పెద్ద కొండ చిలువ చిరుత పులిని మింగడానికి ప్రయత్నించింది. అయితే చివరకు చోటు చేసుకున్న ఘటన చూసి అంతా అవాక్కవుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న ఓ పెద్ద కొండచిలువకు పులి కనిపిస్తుంది. దాన్ని చూడగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా దాడికి దిగింది. పులి తలను పట్టుకుని (python tried to swallow the tiger) మింగేందుకు ప్రయత్నించింది. కొండచిలువ నుంచి తప్పించుకోవాలని పులి ఎంత ప్రయత్నించినా దాని వల్ల సాధ్యం కాలేదు.
Viral Video: చూడటానికే చేప.. దీని దంతాల పవర్ చూస్తే మతి పోవాల్సిందే..
ఇలా చాలా సేపు పులిని అలాగే నోటితో పట్టుకుని ఉంటుంది. ఈ ఘటనలో పులి ప్రాణాలు కోల్పోయిందోమే అని అంతా అనుకుంటారు. అయితే ఆ వెంటనే అంతా అవాక్కయ్యే ఘటన చోటు చేసుకుంది. అప్పటిదాకా పులిని చంపేయడానికి ప్రయత్నించిన కొండచిలువ.. ఆ తర్వాత దాన్ని వదిలేసి తలగడగా మారిపోయింది. దీంతో పులి చివరకు కొండచిలువపై తల పెట్టి హాయిగా నిద్రపోయింది. అయితే ఈ ఘటన నిజంగా జరిగినట్లు అనిపించుకున్నా.. అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది.
Viral Video: తుపాకీతో భయపెట్టాలని చూడగా.. బైకర్ మాటల తూటాల దాటికి చివరకు..
ఇదంతా ఏఐ టెక్నాలజీతో చేసినట్లుగా అనిపిస్తోందని చాలా మంది అంటున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఇదేంటీ మరీ విచిత్రంగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘గ్రాఫిక్స్‌లా అనిపిస్తున్నా.. చూడ్డానికి మాత్రం చాలా వింతగా ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 లక్షలకు పైగా లైక్‌లు, 2.1 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Cat Funny Viral Video: ఈ పిల్లి ధైర్యం మామూలుగా లేదుగా.. యజమాని ఇంటికి ఏం తెచ్చిందో చూడండి..
ఇవి కూడా చదవండి..
Monkey Funny Video: కొమ్మ చివరన కోతి.. పండు ఎలా కోసిందో చూస్తే..
Food Funny Video: విందులో వింత నిర్వాకం.. ఈ అతిథులు చేసిన నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..
Stunts Viral Video: చావు అంచుల దాకా వెళ్లడమంటే ఇదే.. వ్యూస్ కోసం వీళ్ల నిర్వాకం చూస్తే..