Viral Video: గుండెను పిండేసే సీన్.. కోతిని చుట్టేసిన కొండచిలువ.. కాపాడమంటూ హాహాకారాలు.. చివరకు..
ABN , Publish Date - Jan 19 , 2025 | 09:47 PM
వేట కోసం వేచి చూస్తున్న కొండచిలువకు కోతి కనిపించింది. ఇంకేముందీ.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా కోతిని చుట్టేసింది. కొండచిలువ ఊహించని విధంగా దాడి చేయడంతో కోతి షాక్ అయింది. దాన్నుంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నించింది. అయితే..

కోతులంటేనే.. చెట్టు కొమ్మలపై గంతులేయడం, ఇళ్లల్లోకి దూరి వస్తువులు లాక్కెళ్లడం వంటి ఘటనలే గుర్తుకొస్తాయి. అయితే ఇలాంటి కోతులు కూడా కొన్నిసార్లు అంతా ఆశ్చర్యపోయేలా ప్రవర్తిస్తుంటాయి. మరికొన్నిసార్లు వాటిని చూస్తే.. అయ్యో.. పాపం.. అనేలా జాలి కూడా కలుగుతుంటుంది. ఇలాంటి హృదయ విదారక సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ కొండచిలువకు చిక్కిన కోతి వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను చూసిన వారంతా తమ బాధను వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తు్న్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. వేట కోసం వేచి చూస్తున్న కొండచిలువకు కోతి కనిపించింది. ఇంకేముందీ.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా కోతిని చుట్టేసింది. కొండచిలువ ఊహించని విధంగా దాడి చేయడంతో కోతి షాక్ అయింది. దాన్నుంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నించింది. అయితే కొండచిలువ గట్టిగా (python wrapped around monkey) చుట్టేయడంతో తప్పించుకోవడం కోతి వల్ల సాధ్యం కాలేదు.
Viral Video: వామ్మో..! ఇదేంట్రా బాబోయ్.. రైల్లో సీటు కోసం వీళ్లు చేస్తున్న నిర్వాకం చూస్తే..
చివరకు కోతి నిస్సహాయస్థితిలో తనను కాపాడమంటూ అరవడం మొదలెట్టింది. ఎంతో బాధతో కోతి అరుస్తున్న తీరు చూసి అంతా అయ్యో పాపం అని జాలిపడ్డారు. అయితే ఎవరూ దాన్ని కాపాడే ప్రయత్నం మాత్రం చేయలేదు. పైగా ఆ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. చివరకు కోతి కొండచిలువ బారి నుంచి తప్పించుకుందా లేదా అనే విషయం మాత్రం తెలియరాలేదు.
Viral Video: హైనాలే కదా అని తక్కువ అంచనా వేస్తున్నారా.. ఈ సింహం పరిస్థితి ఏమైందో చూడండి..
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో.. ఈ కోతికి ఎంత కష్టం వచ్చింది’’.. అంటూ కొందరు, ‘‘కోతిని కాపాడకుండా ఇలా వీడియోలు తీయడం దారుణం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6వేలకు పైగా లైక్‌లు, 3.24 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..