Share News

Viral News : రూల్స్ తప్పితే.. ఇలానే ఉంటాది.. ట్రాఫిక్ పోలీస్ వింత పనిష్మెంట్..

ABN , Publish Date - Jan 20 , 2025 | 03:54 PM

రూల్స్ తప్పితే ఇలానే ఉంటాది అంటూ స్కూల్ బస్ నడిపే డ్రైవర్‌కు విచిత్రమైన పనిష్మెంట్ ఇచ్చాడు కర్ణాటక ట్రాఫిక్ పోలీస్. ఆ వీడియో ఇప్పుడు సామాజిక మధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. డ్రైవర్‌కు బుద్ధొచ్చేలా ట్రాఫిక్ పోలీస్ భలే చేశారని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు..

Viral News : రూల్స్ తప్పితే.. ఇలానే ఉంటాది.. ట్రాఫిక్ పోలీస్ వింత పనిష్మెంట్..
Driver Made to Hear Own Honking as Punishment,

ముందూ వెనకా చూసుకోకుండా రోడ్లపై ఇష్టమొచ్చినట్టు వెహికల్స్ నడిపేస్తుంటారు చాలామంది. వేగంగా వెళితే తమతో పాటు పక్కవాళ్లకీ ప్రమాదమే అనే ధ్యాసే ఉండదు. రెడ్ సిగ్నల్ ఉన్నా జనాల మధ్యలోంచి రయ్యి రయ్యిమని దూసుకపోతుంటారు. తాగి డ్రైవ్ చెయ్యడం తప్పు, ప్రమాదమని తెలిసినా మానుకోరు కొందరు. డ్రంక్ అండ్ డ్రైవ్‌ పట్టుబడితే అనే భయమూ ఉండదు. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి పక్కోళ్ల ప్రాణాలకు ఎసరుపెడుతుంటారు. ఇక, ట్రాఫిక్ నిలిచిపోయినపుడు అవసరమున్నా, లేకపోయినా పదే పదే హారన్ కొడుతూ సౌండ్ పొల్యుషన్ క్రియేట్ చేయడం కొందరికి అలవాటు. కర్ణాటకలో కూడా ఓ స్కూల్ బస్సు నడిపే డ్రైవర్ ఇలానే విసిగించడంతో ట్రాఫిక్ పోలీస్ విచిత్రమైన శిక్ష వేశాడు. ఈ హిలేరియస్ పనిష్మెంట్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారింది..


వైరల్ అవుతున్న ఈ వీడియోలో, హారన్‌తో రోడ్డుపై వెళ్లేవారిని విసిగించిన ఓ స్కూల్ బస్ డ్రైవర్‌కు ట్రాఫిక్ పోలీస్ ఎలా బుద్ధి చెప్పాడో చూడవచ్చు. డ్రైవర్‌ని బస్సు ముందర కూర్చోబెట్టి అతడి హారన్‌నే ఫుల్ వాల్యూమ్ పెట్టి వినిపించాడు. ఇప్పుడు తెలిసిందా హారన్ పెద్ద సౌండ్‌తో వింటే ఎలా ఉంటుందో అంటూ చెప్పడం కనిపిస్తుంది.


ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. చేసిన తప్పేంటో తెలిసేలా డ్రైవర్‌కు ప్రాక్టికల్‌గా పనిష్మెంట్ ఇచ్చిన ట్రాఫిక్ పోలీస్ సెన్సాఫ్ హ్యూమర్‌‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు."పెద్ద సౌండ్‌ వచ్చేలా హారన్ కొట్టే డ్రైవర్లకు ఇదొక గుణపాఠం", " ట్రాఫిక్ పోలీస్ భలే బుద్ధి చెప్పారు", "బిగ్గరగా హారన్ కొడుతూ విసిగించేవారికి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చారని" రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.

Updated Date - Jan 20 , 2025 | 03:58 PM