Share News

Elderly Couple Ride: బుల్లెట్‌పై దూసుకెళ్లిన వృద్ధ జంట.. అర్జున్ రెడ్డి స్టైల్‌లో..!

ABN , Publish Date - Jun 18 , 2025 | 05:09 PM

సోషల్ మీడియాలో రోజూ అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే ఇది అలాంటి ఇలాంటి వీడియో కాదు. అర్జున్ రెడ్డి స్టైల్‌లో ఓ వృద్ధ జంట బైక్‌పై దూసుకెళ్తున్న తీరు చూస్తుంటే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే.

Elderly Couple Ride: బుల్లెట్‌పై దూసుకెళ్లిన వృద్ధ జంట.. అర్జున్ రెడ్డి స్టైల్‌లో..!
Viral Videos

వయసు మీద పడిన వాళ్లను చాలా మంది చులకనగా చూస్తుంటారు. వాళ్లు ఏమైనా చేద్దామన్నా ఈ వయసులో అవసరమా అంటూ ఆపేస్తుంటారు. ప్రోత్సహించక పోగా.. ఈ ఏజ్‌లో ఎందుకంటూ సూటిపోటి మాటలు అంటుంటారు. అయితే కొందరు మాత్రం వయసు మీద పడినా ఎవరి మాటా వినరు. తమకు నచ్చినట్లు జీవిస్తుంటారు. ఏజ్‌‌తో సంబంధం లేకుండా సంతోషంగా బతుకుతుంటారు. మనసుకు నచ్చింది చేయడానికి వయసు అడ్డంకి కాదని నిరూపిస్తుంటారు. ఈ వృద్ధ జంట కూడా ఆ కోవలోకే వస్తుందని చెప్పొచ్చు. బుల్లెట్ మీద దూసుకెళ్తూ ఉర్రూతలూగించిన ఓ జంట వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.


వాయు వేగంతో..

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులపై యువకులు రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్లడం చూస్తూనే ఉంటాం. బరువు ఎక్కువగా ఉండే ఈ వాహనాలను కంట్రోల్ చేయడం అంత సులువేం కాదు. అందుకే ఎక్కువగా యువకులు, మధ్య వయస్కులే వీటిని నడుపుతుంటారు. వృద్ధులు ఈ వాహనాలను డ్రైవ్ చేయడం చాలా తక్కువ. అలాంటిది ఓ పెద్దాయన ఎన్‌ఫీల్డ్ బైక్ మీద వాయు వేగంతో దూసుకెళ్లాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ బైక్‌పై ఓ వృద్ధురాలు కూడా ఉండటం గమనార్హం.


అప్పట్లో ఎలా ఉండేవాడో..

వృద్ధ జంట రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ మీద దూసుకెళ్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై టైటానిక్ అనే పేరు ఉండటం విశేషం. ఈ వాహనం పక్క నుంచి వెళ్తున్న ఓ కారులోని వ్యక్తి దీన్ని రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడం.. అది కాస్తా వైరల్ అవడం జరిగిపోయాయి. అది టైటానిక్ బైక్ కాదు.. టైటానిక్ షిప్ అని, అందులో వెళ్తున్నది వృద్ధ జంట కాదు.. హీరోహీరోయిన్లు జాక్-రోజ్ అని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అర్జున్ రెడ్డిని మించిపోయాడుగా పెద్దాయన అని మరికొందరు అంటున్నారు. తాత జోరు మామూలుగా లేదు అని చెబుతున్నారు. ఇప్పుడే ఇలా ఉన్నాడంటే.. అప్పట్లో ఎలా ఉండేవాడో అని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.


ఇవీ చదవండి:

పెళ్లై 70 ఏళ్లు.. భార్య మీద ప్రేమతో..

కొంచెం ఆగాలి కదా అక్కా.. కంగారు పడితే

ట్రిక్ మామూలుగా లేదుగా..

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 18 , 2025 | 05:13 PM