Spilled Coffee in Flight: ప్రయాణికురాలపై ఒలికిన కాఫీ.. రూ.83 కోట్ల పరిహారం కోసం దావా..
ABN , Publish Date - Jun 17 , 2025 | 07:36 PM
విమాన ప్రయాణంలో చిన్న చిన్న అపశృతులు, అసౌకర్యాలు ఎదురుకావడం సర్వసాధారణం. అయితే అలాంటి చిన్న పొరపాటు మీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించి, మీ టూర్ మొత్తంపై ప్రభావం చూపిస్తే ఎలా ఉంటుంది. ఎంత కోపం వస్తుంది.

విమాన ప్రయాణంలో (Flight Journey) చిన్న చిన్న అపశృతులు, అసౌకర్యాలు ఎదురుకావడం సర్వసాధారణం. అయితే అలాంటి చిన్న పొరపాటు మీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించి, మీ టూర్ మొత్తంపై ప్రభావం చూపిస్తే ఎలా ఉంటుంది. ఎంత కోపం వస్తుంది. న్యూయార్క్‌కు చెందిన వృద్ధ దంపతులకు తాజాగా ఇలాంటి అనుభవమే ఎదురైంది. దీంతో వారు సదరు ఎయిర్‌లైన్స్ సంస్థపై ఏకంగా 83 కోట్ల రూపాయలకు దావా వేశారు. దీంతో ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది (Spilled Coffee in Flight).
న్యూయార్‌కు చెందిన 78 ఏళ్ల ఐమారా కార్బో తన భర్త గియుసెప్‌తో కలిసి స్కాండినేవియన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణిస్తోంది. విమానంలో ఉన్న ఎయిర్‌హోస్టెస్‌ను ఐమారా కాఫీ (Coffee) అడిగింది. ఎయిర్‌హోస్టెస్ వేడి వేడి కాఫీని తీసుకొచ్చింది. అయితే ఆ కప్పును అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆ వేడి కాఫీ కాస్తా ఐమారాపై పడింది. కాఫీ చాలా వేడిగా ఉండటం వల్ల ఐమారా చర్మం తీవ్రంగా కాలిపోయింది. దీంతో వారు ఆ తర్వాత ఆ ట్రిప్ సమయంలో చాలా ఇబ్బందులు పడ్డారు. సెలవులను సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోయారు.
ఈ ఘటన తర్వాత ఐమారా భర్త స్కాండినేవియన్ ఎయిర్‌లైన్స్‌పై 10 మిలియన్ డాలర్లకు (రూ.83.45 కోట్లు) దావా వేశారు. హాట్ డ్రింక్స్ విషయంలో ఎయిర్‌లైన్ భద్రతా ప్రమాణాలను పాటించలేదని, వృద్ధ ప్రయాణీకుల భద్రతలో తీవ్ర నిర్లక్ష్యం చూపించిందని వారి తరఫు న్యాయవాది జోనాథన్ రీటర్ దావా వేశారు. ఐమారా వైద్య ఖర్చులు, మానసిక ఒత్తిడి, సెలవుల నష్టానికి పరిహారంగా సదరు ఎయిర్‌లైన్స్ సంస్థ 10 మిలియన్ డాలర్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. స్కాండినేవియన్ ఎయిర్‌లైన్స్ ఈ విషయంలో ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటనా చేయలేదు.
ఇవి కూడా చదవండి..
మీ చూపు షార్ప్ అయితే.. ఈ గదిలో పిల్లి ఎక్కడుందో 11 సెకెన్లలో కనిపెట్టండి
ఇలాంటి తెలివితేటలు ఎక్కడి నుంచి వస్తాయో.. బావిలో పడిన బంతిని ఎలా తీశారో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..