Share News

Funny Video: కొంచెం ఆగాలి కదా అక్కా.. కంగారు పడితే అంతే.. ఈ ఫన్నీ వీడియో చూస్తే నవ్వాగదు..

ABN , Publish Date - Jun 18 , 2025 | 08:55 AM

రోడ్ల మీద నడిచి వెళ్లేటపుడు, ట్రాఫిక్ సమయాల్లో, రహదారుల మరమ్మత్తులు జరుగుతున్నప్పుడు కాస్త సహనం పాటించాలి. తొందరగా వెళ్లిపోవాలని ప్రయత్నించకూడదు. ఏమాత్రం తొందరపాటు ప్రయత్నం చేసినా అందుకు తగిన మూల్యం చెల్లించక తప్పదు. తాజాగా ఓ యువతికి అలాంటి పరిస్థితే ఎదురైంది.

Funny Video: కొంచెం ఆగాలి కదా అక్కా.. కంగారు పడితే అంతే.. ఈ ఫన్నీ వీడియో చూస్తే నవ్వాగదు..
Funny viral Video

రోడ్ల మీద నడిచి వెళ్లేటపుడు, ట్రాఫిక్ సమయాల్లో, రహదారుల మరమ్మత్తులు జరుగుతున్నప్పుడు కాస్త సహనం పాటించాలి. తొందరగా వెళ్లిపోవాలని ప్రయత్నించకూడదు. ఏమాత్రం తొందరపాటు ప్రయత్నం చేసినా అందుకు తగిన మూల్యం చెల్లించక తప్పదు. తాజాగా ఓ యువతికి అలాంటి పరిస్థితే ఎదురైంది. దీంతో ఆమె తన చెప్పులను వదులుకోవాల్సి వచ్చింది. ఆ ఘటనకు సంబంధించిన ఫన్నీ వీడియో (Funny Video) ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన జనాలు నవ్వుకుంటున్నారు (Viral Video).


@byomkesbakshy అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక చోట రోడ్డు నిర్మిస్తున్నట్లు కనిపిస్తోంది. రోడ్డు మీద తారు వేసి ఉంచారు. ఆ సమయంలో ఓ యువతి ఆ రోడ్డు మీద నుంచి వెళ్లాలని అనుకుంది. తారు ఇంకా పూర్తిగా ఆరక ముందు దాని మీద నుంచి నడిచివెళ్లిపోయే ప్రయత్నం చేసింది. దాంతో ఆమె వేసుకున్న చెప్పులు తారుకు అంటుకుపోయాయి. ఆమె ఎంతగా ప్రయత్నించినా ఆ చెప్పులు బయటకు రాలేదు. దీంతో ఆమె ఆ చెప్పులను అక్కడే వదిలేసి బయటకు వెళ్లిపోవాల్సి వచ్చింది.


ఈ ఘటనను రికార్డు చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు లక్ష మంది వీక్షించారు. వేల మంది వీక్షించి ఫన్నీ కామెంట్లు చేశారు. 'కొంచెం సేపు ఆగాల్సింది కదా అక్కా', 'తొందరపడితే ఇలాగే నష్టం తప్పదు', 'వెరీ ఫన్నీ' అంటూ నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు.


ఇవి కూడా చదవండి..

మీ చూపు షార్ప్ అయితే.. ఈ గదిలో పిల్లి ఎక్కడుందో 11 సెకెన్లలో కనిపెట్టండి

ఇలాంటి తెలివితేటలు ఎక్కడి నుంచి వస్తాయో.. బావిలో పడిన బంతిని ఎలా తీశారో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 18 , 2025 | 08:55 AM