Share News

Gir National Park : గిర్ నేషనల్ పార్క్ ఎక్కడుంది.. ఎలా చేరుకోవాలి.. జంగిల్ సఫారీకి ఉత్తమ సమయం ఏది..

ABN , Publish Date - Mar 06 , 2025 | 05:28 PM

Why Gir National Park is Special : ఇటీవల గిర్ నేషనల్ పార్క్‌లో ప్రధాన మంత్రి లయన్ సఫారీ దేశవ్యాప్తంగా ప్రజలను ఎంతో ఆకర్షించింది. మీకూ వన్యప్రాణులు, ప్రకృతి అందాలను ఆస్వాదించడం ఇష్టమైతే.. గిర్ నేషనల్ పార్క్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. ఈ ప్రాంతాన్ని ఏ సమయంలో సందర్శించాలి.. ఎలా చేరుకోవాలి తదితర విషయాలు..

Gir National Park : గిర్ నేషనల్ పార్క్ ఎక్కడుంది.. ఎలా చేరుకోవాలి.. జంగిల్ సఫారీకి ఉత్తమ సమయం ఏది..
Gir National Park Trip

How To Go National Park : భారతదేశంలో అనేక నేషనల్ పార్కులు ఉన్నాయి. వీటిల్లో పెద్ద సంఖ్యలో జంతువులు, పక్షులు మనకు నివసిస్తాయి. వన్యప్రాణులను రక్షించడానికి, ప్రజలలో వాటిపై అవగాహన కల్పించే ఉధ్దేశంతో ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్‌లోని గిర్ జాతీయ ఉద్యానవనానికి సందర్శించారు. ఈ సందర్భంగా పీఎం జంగిల్ సఫారీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అక్కడి ఆసియా సింహాల ప్రత్యేకత, జంతువుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి చాలామందిలో కలిగింది. మీరు కూడా గిర్ జాతీయ ఉద్యానవనాన్ని సందర్శించాలనుకుంటే.. ఇక్కడికి ఎలా చేరుకోవాలో.. ఎప్పుడు చేరుకోవాలో తెలుసుకోండి.


గిర్ నేషనల్ పార్క్ సందర్శన ఇలా ప్లాన్ చేయండి..

  • రైలు : హైదరాబాద్ (కాచిగూడ లేదా సికింద్రాబాద్) లేదా విజయవాడ నుంచి రాజ్‌కోట్ లేదా వెరవాల్‌కు రైలులో చేరుకోవచ్చు. వెరావల్ రైల్వే స్టేషన్ గిర్ నుంచి 70 కి.మీ దూరంలో ఉంది. మీరు కారులో వెళ్లాలనుకుంటే, మీరు అహ్మదాబాద్, రాజ్‌కోట్, సూరత్, డయ్యు మీదుగా గిర్ నేషనల్ పార్క్ చేరుకోవచ్చు. టికెట్ ఛార్జీలు రూ. 500 - రూ.1,500. సందర్భాన్ని బట్టి మారవచ్చు. వీలైతే IRCTC ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోండి. మొత్తం బడ్జెట్ రూ.5500-రూ.12,500.

  • బస్సు : హైదరాబాద్ లేదా విజయవాడ నుండి రాజ్‌కోట్ లేదా వెరవాల్‌కు APSRTC లేదా TSRTC లేదా ప్రైవేట్ బస్సుల ద్వారా వెళ్లవచ్చు. టికెట్ ఛార్జీలు రూ. 500 - రూ.1,000. మొత్తం బడ్జెట్ రూ.5500-రూ.12,500.

  • విమానం : ఫ్లైట్ ద్వారా మీరు గిర్ నేషనల్ పార్క్ వెళ్లాలి అనుకుంటే, ఇందుకోసం 6 లేదా 7 నెలలు ముందుగానే టికెట్ బుక్ చేసుకోవాలి. టికెట్ ఖర్చు హైదరాబాద్ టు రాజ్ కోట్ కిషోర్ కుమార్ గాంధీ విమానాశ్రయానికి రూ.7000-7500. ఇది గిర్ నుంచి 160 కి.మీ దూరంలో ఉంది. గిర్‌కు సమీప విమానాశ్రయం 110 కి.మీ దూరంలో ఉన్న డయ్యు విమానాశ్రయం. ఇక్కడి నుండి మీరు టాక్సీ లేదా బస్సులో వెళ్ళవచ్చు. గిర్ 3-4 రోజుల ట్రిప్‌కు మొత్తం ఖర్చు రూ.15వేలు- రూ.25వేలు కావచ్చు.


ఏం టైంలో వెళ్తే బెటర్?

గిర్ నేషనల్ పార్క్ సందర్శించడానికి అక్టోబర్-నవంబర్ లేదా ఫిబ్రవరి-మార్చి ఉత్తమ సమయం. ఈ టైంలో మీరు ఆసియా సింహాలు, చిరుతలు, ఇతర అడవి జంతువులను ప్రత్యక్షంగా చూసి ఆస్వాదించవచ్చు. ఏప్రిల్-జూన్ మధ్య వేసవి కారణంగా అధిక వేడి ఉంటుంది. కాబట్టి, వెళ్లకపోవడమే మంచిది. వర్షాకాలంలో జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఈ పార్క్ మూసివేస్తారు.


జంగిల్ సఫారీని ఎలా బుక్ చేసుకోవాలి?

గిర్ నేషనల్ పార్క్ లో అతిపెద్ద ఆకర్షణ జంగిల్ సఫారీ. మీరు ఫారెస్ట్ సఫారీని ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఇక్కడికి చేరుకున్న తర్వాత కూడా మీరు సఫారీని బుక్ చేసుకోవచ్చు. జంగిల్ సఫారీ సమయం ఉదయం 6:30 నుండి 9:30 వరకు. రెండవ రౌండ్ మధ్యాహ్నం 3:00 నుండి సాయంత్రం 6:00 వరకు ఉంటుంది. సఫారీ ఖర్చు రూ.800-1000 ఉండవచ్చు.


గిర్‌లో ఎక్కడ బస చేయాలి?

మీరు గిర్ సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే.. అక్కడ అనేక హోటళ్ళు, రిసార్ట్‌లు, అతిథి గృహాలు కనిపిస్తాయి. మీ సౌకర్యాన్ని బట్టి మీరు ఎక్కడైనా బస చేయవచ్చు. ఒక రోజు బసకు రూ.500 నుంచి మొదలవుతుంది.


Read Also : Spam Calls: స్పామ్ కాల్స్ కట్టడి కోసం కీలక చర్యలు.. రోజుకు 13 మిలియన్ల కాల్స్ బ్లాక్

Green Grapes Vs Black Grapes: ఆకుపచ్చ ద్రాక్ష, నల్ల ద్రాక్ష.. ఈ రెండింటి మధ్య వ్యత్యాసాలు ఏటంటే..

Astrology Tips: ఈ రాశి పురుషులు ఉత్తమ భర్తలు..

Updated Date - Mar 06 , 2025 | 05:38 PM