Home » Tourist Places
స్విస్ దేశపు శైలి పచ్చిక బయళ్లు మొదలు, మధ్యధరా సముద్రాల వరకు ఈ ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు. అయితే, వాటికి ఏమాత్రం తీసిపోని టూరిస్ట్ ప్లేసెస్ ఇండియాలోనే ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా..
మన దేశంలో కొన్ని అద్భుతమైన ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ సైన్స్ కూడా ఎలా సాధ్యమని ఆశ్చర్యపోతుంది. ఈ స్థలాలు కేవలం ఆధ్యాత్మికమే కాదు, శాస్త్రవేత్తల పరిశోధనకు కూడా ఆసక్తికరంగా మారాయి. అవి ఎక్కడ ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
కర్ణాటకలోని ప్రకృతి సోయగాలను ఒకే టూర్‌లో సందర్శించే అవకాశం కల్పిస్తోంది ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC). కాఫీ విత్ కర్ణాటక టూర్ పేరిట తీసుకొచ్చిన ప్యాకేజీ కింద కేవలం రూ.12 వేలకే కూర్గ్, మైసూర్ సహా పలు పలు ప్రదేశాలను చుట్టేయొచ్చు.
నేచర్ లవర్స్ స్వర్గధామం.. కుంటాల వాటర్‌ఫాల్స్.. ఇది తెలంగాణలో అత్యంత ఎత్తైన జలపాతం. వర్షాకాలంలో పరవళ్లు తొక్కే కుంటాల జలపాత సోయగాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. హైదరాబాద్‌కు సమీపంలోనే ఉన్న ఈ వాటర్ ఫాల్స్ ప్రత్యేకలేంటి? ఎలా వెళ్లాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రీరాముని జీవితానికి సంబంధించిన కీలక ప్రదేశాలను ఒకే టూర్ ద్వారా సందర్శించే అవకాశం కల్పిస్తోంది ఐఆర్‌సీటీసీ. ఇకపై భక్తులు రామాయణ యాత్ర ప్యాకేజీ ద్వారా కేవలం 17 రోజుల్లో 30 రామక్షేత్రాలను దర్శించుకోవచ్చు.
దక్షిణ భారతంలోని ఆధ్యాత్మిక క్షేత్రాలను ఒకే ట్రిప్ ద్వారా చుట్టేసేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మరో సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. జులై 28 నుంచి ప్రారంభం కానున్న ఈ 13 రోజుల యాత్రకు IRCTC టూరిజం అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఇప్పుడు కొత్తగా ప్రయాణికుల కోసం వీక్లీ టూరిజం ప్యాకేజీలను ప్రవేశపెట్టింది. అదీ టికెట్ గ్యారెంటీ హామీతో. టూర్ ప్యాకేజీని బట్టి యాత్రికులు దేశవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను దర్శించుకోవచ్చు.
IRCTC Ramayana Yatra Package: దేశవ్యాప్తంగా పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఎప్పటికప్పుడు సరికొత్త టూర్ ప్యాకేజీలను తీసుకొస్తుంటుంది. ఈ క్రమంలోనే మరోసారి రామాయణ యాత్ర స్పెషల్ టూర్ ప్యాకేజీ ప్రారంభించనుంది. ఈ నెల జులై 25 నుంచి మొదలుకానున్న ఈ ఆధ్యాత్మిక యాత్రలో పర్యాటకులు 17 రోజుల్లోనే 30 ప్రముఖ రామక్షేత్రాలను దర్శించుకోవచ్చు.
రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక సంస్థ అందించే అన్ని సేవలను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పించనున్నారు. తద్వారా పర్యాటకుల విలువైన సమయం వృథా కాకుండా ఏర్పాట్లు చేయనున్నారు.
IRCTC Mata Vaishno Devi Tour 2025: దేశవిదేశాల్లోని ప్రముఖ్య పర్యాటక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాల సందర్శన కోసం భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) వివిధ రకాల టూర్ ప్యాకేజీలను తీసుకొచ్చింది. ఉత్తరభారతంలోని ప్రధాన పుణ్యక్షేత్రాలను ఒకే ట్రిప్ లో దర్శించుకోవాలని కోరుకునే దక్షిణాది భారతీయుల కోసం భారత్ గౌరవ టూరిస్ట్ ట్రైన్ ఓ ప్యాకేజీ ప్రకటించింది.