IRCTC Tour: రూ.12 వేలకే 6 రోజుల IRCTC టూర్.. ఫ్యామిలీ వెకేషన్‌కి బెస్ట్ ఆప్షన్..!
ABN , Publish Date - Jul 31 , 2025 | 10:36 AM
కర్ణాటకలోని ప్రకృతి సోయగాలను ఒకే టూర్‌లో సందర్శించే అవకాశం కల్పిస్తోంది ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC). కాఫీ విత్ కర్ణాటక టూర్ పేరిట తీసుకొచ్చిన ప్యాకేజీ కింద కేవలం రూ.12 వేలకే కూర్గ్, మైసూర్ సహా పలు పలు ప్రదేశాలను చుట్టేయొచ్చు.

IRCTC Koffee With Karnataka Tour: ప్రకృతి ప్రేమికులు, చారిత్రక అన్వేషకులకు గుడ్ న్యూస్. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) 'కాఫీ విత్ కర్ణాటక' పేరిట ఒక అద్భుతమైనప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం రూ.12,000 ఖర్చుతోనే కూర్గ్, మైసూర్ సహా ప్రముఖ దేవాలయాలను సందర్శించవచ్చు. ఆరు రోజుల పాటు అందమైన జలపాతాలు, చారిత్రక కట్టడాలు, కాఫీ తోటలు, మైసూర్ రాజభవనం, చాముండి హిల్స్ సహా అనేక ప్రదేశాల్లో పర్యటించవచ్చు. ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఐఆర్‌టీసీ టూరిజం తీసుకొచ్చిన 'కాఫీ విత్ కర్ణాటక' టూర్ హైదరాబాద్ నుంచి ప్రారంభమవుతుంది. కాచిగూడ, జడ్చర్ల, గద్వాల్, మహబూబ్‌నగర్, కర్నూలు, డోన్ మీదుగా రైలు గమ్యస్థానం చేరుకుంటుంది. ఆయా ప్రాంతాల్లోని ప్రయాణికులు రైలు ఎక్కొచ్చు. తిరుగు ప్రయాణంలోనూ ట్రైన్ ఇదే స్టేషన్ల మీదుగా హైదరబాద్ చేరుకుంటుంది. ఆరు రోజుల టూర్‌లో పర్యాటకులు ప్రధానంగా కూర్గ్, మైసూర్లో ఉన్న పలు దర్శనీయ స్థలాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తారు.
ప్రయాణ షెడ్యూల్:
1వ రోజు: కాచిగూడ నుంచి రాత్రి 7గంటలకు ట్రైన్ బయలుదేరుతుంది.
2వ రోజు: ఉదయం మైసూర్ చేరుకుని అక్కడి నుంచి కూర్గ్‌కి ప్రయాణం. అబ్బె జలపాతం, ఓంకారేశ్వర ఆలయం సందర్శన.
3వ రోజు: తలకావేరి, భాగమండలం, రాజా సీట్ పార్క్ వంటి ప్రదేశాలు చూడొచ్చు.
4వ రోజు: మైసూర్‌కి తిరుగు ప్రయాణం. మార్గమధ్యంలో కావేరి నిసర్గధామ, టిబెటన్ మానెస్టరీ, బృందావన్ గార్డెన్స్ సందర్శన.
5వ రోజు: చాముండీ హిల్స్, మైసూర్ ప్యాలెస్ సందర్శిస్తారు. మధ్యాహ్నం మైసూర్ స్టేషన్ నుంచి రిటర్న్ జర్నీ.
6వ రోజు: ఉదయం కాచిగూడకు చేరుకుంటారు.
ప్యాకేజీ ధరలు (ఒక్కో వ్యక్తికి)
కంఫర్ట్ (3AC):
సింగిల్ షేరింగ్: రూ.33,160
డబుల్ షేరింగ్: రూ.18,730
ట్రిపుల్ షేరింగ్: రూ.14,690
పిల్లలకు (విత్ బెడ్): రూ.11,140
పిల్లలకు (విత్ అవుట్ బెడ్): రూ.9,530
స్టాండర్డ్ (SL):
సింగిల్ షేరింగ్: రూ.31,140
డబుల్ షేరింగ్: రూ.16,710
ట్రిపుల్ షేరింగ్: రూ.12,670
పిల్లలకు (విత్ బెడ్): రూ.9,120
పిల్లలకు (విత్ అవుట్ బెడ్): రూ.7,510
ప్యాకేజీ సదుపాయాలు:
3AC లేదా SL క్లాస్‌లో రైలు ప్రయాణం, నాన్ A/C ట్రావెల్ వెహికల్స్ ద్వారా లోకల్ ట్రాన్స్ పోర్టేషన్, హోటల్ బస (స్టాండర్డ్ రూములు), బ్రేక్‌ఫాస్ట్‌లు, ట్రావెల్ ఇన్సూరెన్స్, టోల్, పార్కింగ్, లోకల్ గైడ్ ఖర్చులు
టూర్ ఎప్పుడుంటుంది?
జులై 9 నుండి ఆగస్టు 27 వరకూ ఈ టూర్ ప్రతి బుధవారం స్టార్ట్ అవుతుంది.
IRCTC అధికారిక వెబ్‌సైట్ (www.irctctourism.com) ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు.
టూర్‌కి సంబంధించి మరిన్ని వివరాలకు IRCTC కస్టమర్ కేర్ లేదా టూరిజం విభాగాన్ని సంప్రదించవచ్చు.
ఇవి కూడా చదవండి:
వీసా-ఫ్రీ.. వీసా-ఆన్-అరైవల్.. ఈ రెండింటి మధ్య తేడా ఏంటో తెలుసా
పాస్‌పోర్టు విషయంలో ఈ తప్పులు చేస్తే చుక్కలే..