IRCTC South India tour: సౌతిండియా చుట్టేందుకు గొప్ప ఛాన్స్.. IRCTC 13 రోజుల ఆధ్యాత్మిక యాత్ర..
ABN , Publish Date - Jul 11 , 2025 | 09:07 PM
దక్షిణ భారతంలోని ఆధ్యాత్మిక క్షేత్రాలను ఒకే ట్రిప్ ద్వారా చుట్టేసేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మరో సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. జులై 28 నుంచి ప్రారంభం కానున్న ఈ 13 రోజుల యాత్రకు IRCTC టూరిజం అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

IRCTC South India Yatra packages 2025: దేశవ్యాప్తంగా ఉన్న అనేక ఆధ్యాత్మిక ప్రాంతాల సందర్శనను ప్రోత్సహించేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) వివిధ రకాల ప్యాకేజీలను ప్రవేశపెడుతోంది. తాజాగా భారత్ గౌరవ్ ప్రత్యేక పర్యాటక రైలు ద్వారా "దక్షిణ దర్శన్ యాత్ర" అనే పేరిట ప్రత్యేకమైన తీర్థయాత్ర ప్యాకేజీని ప్రారంభించింది. ఈ 13 రోజుల యాత్ర జులై 28న పఠాన్‌కోట్ నుంచి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి భక్తులు రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, మార్కాపూర్, తిరుపతితో సహా దక్షిణ భారతదేశంలోని ఏడు పవిత్ర స్థలాలను దర్శించవచ్చు.
ఈ టూర్ కోసం టికెట్ బుక్ చేసుకునే ప్రయాణికులకు కచ్చితంగా టికెట్ బుకింగ్ సదుపాయం ఉంటుంది. అలాగే ఆన్-బోర్డ్, ఆఫ్-బోర్డ్ శాకాహార భోజనం, AC/నాన్-AC హోటల్ వసతి, స్థానిక రవాణా, గైడెడ్ సదుపాయం, ప్రయాణ బీమా, టూర్ మేనేజర్, భద్రతా సిబ్బంది, ఇతర సౌకర్యాలు ఉన్నాయి. ఎకానమీ (స్లీపర్ క్లాస్), స్టాండర్డ్ (థర్డ్ AC), కంఫర్ట్ (సెకండ్ AC) ఇలా నచ్చిన క్లాస్ ను ప్రయాణం కోసం పర్యాటకులు ఎంచుకోవచ్చు.
బోర్డింగ్ పాయింట్లు
పఠాన్‌కోట్ నుంచి మొదలై జలంధర్ సిటీ, లూథియానా, చండీగఢ్, అంబాలా, కురుక్షేత్ర, కర్నాల్, పానిపట్ జంక్షన్, సోనెపట్, హజ్రత్ నిజాముద్దీన్, మధుర, ఆగ్రా, గ్వాలియర్‌లలో బోర్డింగ్, డీబోర్డింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.
వ్యవధి & ఖర్చులు
ప్రయాణం కాలం: 13 రోజులు, 12 రాత్రులు
టికెట్ ధరలు (ఒక్కో వ్యక్తికి): స్లీపర్/ఎకానమీ: రూ.30,135, 3AC: రూ.43,370, 2AC: రూ.57,470
మరిన్ని వివరాలు, బుకింగ్‌ల కోసం, భక్తులు www.irctctourism.com ని సందర్శించవచ్చు.
Also Read:
భరణం హక్కు.. వరకట్నం నేరం.. ఎందుకిలా? అసలు కారణం ఇదే!
తినే విధానాన్ని బట్టి పర్సనాలిటీ కనుక్కోవచ్చని మీకు తెలుసా?
For More Lifestyle News