Tungabhadra: తుంగభద్రకు పోటెత్తుతున్న వరద..
ABN , Publish Date - Jul 05 , 2025 | 01:03 PM
తుంగభద్రకు వరద పోటు కొనసాగుతోంది. జలాశయానికి అధిక ప్రమాణంలో వరద నీరు చేరుతున్న కారణంగా జలాశయం భద్రతా దృష్ట్యా జలాశయం 21 క్రస్ట్‌గేట్ల నుంచి 62,610 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు.

- తుంగ.. ఉత్సాహంగా..
- ఎగువన వర్షాలతో జలాశయానికి పోటెత్తుతున్న వరద
- 21 క్రస్ట్‌గేట్ల నుంచి 66వేల క్యూసెక్కుల నీటి విడుదల
బళ్లారి(బెంగళూరు): తుంగభద్ర(Tungabhadra)కు వరద పోటు కొనసాగుతోంది. జలాశయానికి అధిక ప్రమాణంలో వరద నీరు చేరుతున్న కారణంగా జలాశయం భద్రతా దృష్ట్యా జలాశయం 21 క్రస్ట్‌గేట్ల నుంచి 62,610 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. జలాశయం పై భాగంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నకారణంగా జలాశయానికి అధిక ప్రమాణంలో వరద నీరు చేరుతున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రస్తుతం జలాశయం ఎత్తు 1624.73అడుగులకు నీరు చేరుకోగా, శుక్రవారం సాయంత్రం 6గంటల సమాయానికి 74,555 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. సాగునీటి కాలువలకు 2707 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. జలాశయం 21 క్రస్ట్‌గేట్ల నుంచి 65,852 క్యూసెక్కుల నీరు విడుదల అవుతున్నట్లు బోర్డు అధికారులు వివరించారు.
ఒక్కో క్రస్ట్ గేటు 2.5 అగుడుల చొప్పున పైకి ఎత్తి ప్రతి క్రస్ట్‌గేటు నుంచి 2,820 క్యూసెక్కుల నీరు నదికి విడుదల అవుతోందని బోర్డు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జలాశయంలో 76.612 టీఎంసీల నీరు నిలువ ఉంది. గత ఏడాది ఇదే సమయానికి జలాశయంలో కేవలం 10.089 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాల్వలకు నీటి విడుదలతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పలు జిల్లాల్లో సాగుకు సిద్ధ ం చేసుకున్న నార్లను పొలాలకు తరలిస్తూ సాగుకు సిద్ధం అవుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
విశాఖ వందేభారత్‌కు ఇకపై 20 బోగీలు
నిరుద్యోగుల కష్టాలు కనబడట్లేదా...
Read Latest Telangana News and National News