Siddaramaiah: చరిత్ర తెలియని నాయకన్.. మండిపడిన సీఎం
ABN , Publish Date - May 28 , 2025 | 05:46 PM
కమల్‌హాసన్ ఇటీవల చెన్నైలో జరిగిన 'థగ్ లైఫ్' చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంలో మాట్లాడారు. కన్నడ భాష కూడా తమిళం నుంచే పుట్టిందని ఈ సందర్భంగా అన్నారు. ఆయన వ్యాఖ్యలు కన్నడ నాట దుమారం రేపాయి.

బెంగళూరు: ప్రముఖ నటుడు, రాజకీయనేత కమల్‌హాసన్ (Kamal Haasan) కన్నడ భాషపై ఇటీవల చేసిన వ్యాఖ్యలను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) ఖండించారు. కన్నడ భాషకు సుదీర్ఘమైన చరిత్ర ఉందని, కమల్‌హాసన్‌కు చరిత్ర గురించి తెలియదని అన్నారు.
కమల్‌హాసన్ ఇటీవల చెన్నైలో జరిగిన 'థగ్ లైఫ్' చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంలో మాట్లాడారు. కన్నడ భాష కూడా తమిళం నుంచే పుట్టిందని ఈ సందర్భంగా అన్నారు. ఆయన వ్యాఖ్యలు కన్నడ నాట దుమారం రేపాయి. దీనిపై సిద్ధరామయ్యను మీడియా బుధవారంనాడు ప్రశ్నించడంతో.. కన్నడ భాషకు సుసంపన్నమైన, పురాతన చరిత్ర ఉందన్నారు. 'పాపం.. కమల్‌కు ఆ విషయం తెలీదనుకుంటా' అంటూ చురకలు వేశారు.
కమల్ వ్యాఖ్యలపై పలు కన్నడ సంస్థలు నిరసనలకు దిగాయి. బెళగవి, మైసూరు, హుబ్బళ్లి, బెంగళూరులో నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. కన్నడ భాషకు వేలాది సంవత్సరాల చరిత్ర ఉందని నిరసనకారులు పేర్కొంటూ కమల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కమల్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. అందుకు నిరాకరిస్తే ఆయన చిత్రం 'థగ్ లైఫ్' ప్రదర్శనను రాష్ట్రంలో అడ్డుకుంటామని హెచ్చరించారు. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర సైతం కమల్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. సొంత భాషను గొప్పగా చెప్పుకోవడంలో తప్పు లేదు కానీ ఇతర భాషలను అవమానించడం సరికాదని అన్నారు. కమల్ వెంటనే కన్నడిగులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని సూచించారు.
ఇవి కూడా చదవండి..
ఇక భారత్‌ను చూసి పాక్ వణకాల్సిందే..
రాజ్యసభకు కమల్ హాసన్.. డీఎంకే అధికారిక ప్రకటన
Read Latest National News and Telugu News