Home » Siddaramaiah
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తాజాగా ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చలకు తెరలేపాయి. అధికార పంపకాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
సిద్ధరామయ్య అసిస్టెంట్ రెసిడెంట్ కమిషనర్, స్పెషల్ ఆఫీసర్ సి.మోహన్ కుమార్, డీకే శివకుమార్ ప్రత్యేక అధికారి హెచ్.ఆంజనేయ మధ్య మాటల యుద్ధం దాడులకు దారితీసిందని తెలుస్తోంది.
మైసూరులో శనివారంనాడు ఏర్పాటు చేసిన సాధానా సమావేశంలో ప్రభుత్వం సాధించిన విజయాలను సిద్ధరామయ్య ప్రస్తావించారు. కొత్త ప్రాజెక్టులను ప్రకటించారు. డీకే శివకుమార్‌తో పాటు పలువురు కీలక నేతలు కూడా ఇందులో పాల్గొన్నారు.
బెంగళూరు రూరల్ జిల్లా చెన్నరాయపట్న హొబ్లి, సమీప గ్రామాల్లో 1,77 ఎకరాల సారవంతమైన వ్యవసాయ భూములను సేకరించాలన్న కర్ణాటక ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మూడున్నర ఏళ్లుగా రైతులు, ల్యాండ్ రైట్ యాక్టివిస్టులు తీవ్ర నిరసనలు సాగిస్తున్నారు.
కర్నాటకలో సీఎంగా ఐదేళ్ల పాటు తానే కొనసాగుతానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తేల్చి చెప్పారు. కర్నాటకలో నాయకత్వ మార్పుపై వస్తున్న ఊహాగాహానాలను కొట్టిపారేశారు..
బెంగళూరును 1986లో బెంగళూరు అర్బన్, బెంగళూరు రూరల్‌గా విభజించారు. 2007లో బెంగళూరు రూరల్ నుంచి రామనగర జిల్లాను వేరుచేశారు. గత మేలో రామనగరకు బెంగళూరు సౌత్ జిల్లాగా పేరు పెట్టారు.
కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను సీఎంను చేయమని ఎవరినీ అడగలేదని, నాయకత్వ మార్పు అంశంపై బహిరంగ ప్రకటన చేసే వారికి నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు.
రాష్ట్రంలో యువకులు అకస్మాత్తుగా మరణించడం వెనుక కారణాలపై గత ఫిబ్రవరిలో ఏర్పాటు చేసిన కమిటీకే ఈ బాధ్యత అప్పగించామని, కొవిడ్ వ్యాక్సిన్ వల్ల ప్రతికూల పరిణామాలు ఎదురయ్యాయా? అనే దానిపైనా కమిటీ అధ్యయనం చేస్తుందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు.
గిరిజన సంక్షేమానికి సంబంధించిన కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయని, తప్పుడు బ్యాంకు అకౌంట్లలోకి అక్రమంగా కార్పొరేషన్ అకౌంట్లలోని నిధులు బదిలీ చేశారని ఈ కేసులో ప్రధాన ఆరోపణగా ఉంది. షెల్ కంపెనీలకు తరలించిన నిధులను 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో బళ్లారి నియోజకవర్గంలో వినియోగించినట్టు ఈడీ చెబుతోంది.
కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, రాష్ట్ర ఇన్‌చార్జి రణ్‌దీప్ సూర్జేవాలా రాష్ట్రానికి రావడంపై సిద్ధరామయ్య మాట్లాడుతూ, పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేయడంపై సూర్జేవాలా దృష్టి సారించనున్నట్టు చెప్పారు. పార్టీని పటిష్టం చేయడం కోసం వచ్చారని, ఆయన పని ఆయన చేస్తారని తెలిపారు.