Share News

Karnataka CM Tussle: డీకేను బ్రేక్‌ఫాస్ట్‌కు ఆహ్వానించిన సిద్ధూ

ABN , Publish Date - Nov 28 , 2025 | 10:02 PM

పార్టీ అధిష్ఠానాన్ని కలుసుకునేందుకు ఢిల్లీ ప్రయాణానికి డీకే సిద్ధమవుతున్నారు. ఆయన సోదరుడు డీకే సురేష్ ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. అయితే అధికార మార్పిడి అంశంపై సోదరులిద్దరూ పెదవి విప్పడం లేదు.

Karnataka CM Tussle: డీకేను బ్రేక్‌ఫాస్ట్‌కు ఆహ్వానించిన సిద్ధూ
Siddaramaiah with DK Shivakumar

బెంగళూరు: కర్ణాటకలో న్యాయకత్వ మార్పిడి జరగనుందంటూ వస్తున్న ఊహాగానాలకు తెరదించేందుకు అధిష్ఠానం రంగంలోకి దిగింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లకు హస్తిన నుంచి పిలుపు వచ్చినట్టు తెలుస్తోంది. దీనికి ముందుగా ఇద్దరూ కూర్చుని మాట్లాడుకోవాలని కూడా వారికి అధిష్ఠానం సూచించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో తన డిప్యూటీ డీకే శివకుమార్‌ను శనివారంనాడు బ్రేక్‌ఫేస్ట్‌కు పిలిచినట్టు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారంనాడు తెలిపారు.


'డీకేను అధిష్ఠానం పిలిచింది. నన్ను కూడా పిలిచారు. ముందు ఇద్దరూ కలిసి మాట్లాడుకోవాలని సూచించింది. ఈ క్రమంలోనే శనివారంనాడు బ్రేక్‌ఫాస్ట్‌కు రావాలని డీకేను ఆహ్వానించాను. ఆయన రాగానే అన్ని విషయాలు కలిసి మాట్లాడుకుంటాం' అని సిద్ధరామయ్య చెప్పారు.


కాగా, పార్టీ అధిష్ఠానాన్ని కలుసుకునేందుకు ఢిల్లీ ప్రయాణానికి డీకే సిద్ధమవుతున్నారు. ఆయన సోదరుడు డీకే సురేష్ ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. అయితే అధికార మార్పిడి అంశంపై సోదరులిద్దరూ పెదవి విప్పడం లేదు. తాజాగా సిద్ధరామయ్య సైతం పార్టీ అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అని చెప్పారు. నిన్న కూడా ఇదే విషయాన్ని చెప్పినట్టు గుర్తు చేసారు. డీకే సైతం పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని బహిరంగంగానే చెప్పారని తెలిపారు.


ఇవి కూడా చదవండి..

77 అడుగుల రాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ

ఉడిపిలో లక్ష కంఠ గీతా పఠనం.. హాజరైన మోదీ

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Nov 28 , 2025 | 10:06 PM