Siddaramaiah: మాతృభాషను బలహీన పరుస్తున్న హిందీ, ఇంగ్లీష్... సీఎం కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Nov 01 , 2025 | 05:07 PM
అభివృద్ధి చెందిన దేశాల్లో మాతృ భాషలోనే దేశ ఆలోచనా విధానం, లెర్నింగ్, డ్రీమ్స్ ఉంటాయని, ఇక్కడ పరిస్థితి మాత్రం అందుకు భిన్నమని సీఎం సిద్ధరామయ్య విమర్శించారు. మాతృభాషను ప్రోత్సహించేలా కేంద్రం చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.
బెంగళూరు: హిందీని బలవంతంగా రుద్దుతున్నారంటూ తరచు కేంద్రంపై దక్షిణాది రాష్ట్రాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) కీలక వ్యాఖ్యలు చేశారు. హిందీ, ఇంగ్లీషు భాషలు పిల్లల్లోని నైపుణ్యాలను బలహీన పరుస్తున్నాయని కర్ణాటక రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారంనాడిక్కడ జరిగిన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ అన్నారు.
అభివృద్ధి చెందిన దేశాల్లో మాతృ భాషలోనే దేశ ఆలోచనా విధానం, లెర్నింగ్, డ్రీమ్స్ ఉంటాయని, ఇక్కడ పరిస్థితి మాత్రం అందుకు భిన్నమని సీఎం విమర్శించారు. మాతృభాషను ప్రోత్సహించేలా కేంద్రం చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.
కర్ణాటకపై సవతితల్లి వైఖరి
కేంద్ర ప్రభుత్వం కర్ణాటకపై సవతితల్లి వైఖరి ప్రదర్శిస్తూ హిందీని బలవంతంగా రుద్దుతోందని సిద్ధరామయ్య ఆరోపించారు. హిందీ, సంస్కృత భాషల ప్రోత్సాహానికి నిధులు ఇస్తూ, దేశంలోని ఇతర భాషలను నిర్లక్ష్యం చేస్తోందన్నారు. శాస్త్రీయ భాష అయిన కన్నడ భాషాభివృద్ధికి తగినన్ని నిధులు ఇవ్వడానికి కేంద్రం నిరాకరిస్తోందని, సమాఖ్య వ్యవస్థను బలహీనపరుస్తోందని మండిపడ్డారు. కన్నడ వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న వారిని కలిసికట్టుగా వ్యతిరేకించాలన్నారు. కేంద్రానికి ఏటా రూ.4.5కోట్ల ఆదాయాన్ని రాష్ట్రం అందిస్తున్నప్పటికీ కర్ణాటక అభివృద్ధికి నిధులు ఇచ్చేందుకు కేంద్ర నిరాకరిస్తోందని తప్పుపట్టారు.
ఇవి కూడా చదవండి..
ఛత్తీస్‌గఢ్ న్యూ అసెంబ్లీ కాంప్లెక్స్‌ను ప్రారంభించిన మోదీ
ఇతర పార్టీలతో పొత్తులు ఉండవు: ప్రశాంత్ కిశోర్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి