Share News

Delhi Air Pollution: ఢిల్లీలో కొనసాగుతున్న వాయుకాలుష్యం

ABN , Publish Date - Nov 01 , 2025 | 11:09 AM

ఢిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకూ క్షీణిస్తోంది. గాలి నాణ్యత సూచీ (AQI) ప్రమాదకర స్థాయిలో నమోదవుతోంది. తాజాగా శనివారం ఉదయం కూడా గాలి నాణ్యత సూచీ పేలవమైన స్థాయిలో నమోదైంది.

Delhi Air Pollution: ఢిల్లీలో కొనసాగుతున్న వాయుకాలుష్యం
Delhi air pollution

న్యూఢిల్లీ, నవంబర్ 1: దేశ రాజధాని ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ (Air Pollution) రోజురోజుకూ క్షీణిస్తోంది. గాలి నాణ్యత సూచీ (AQI) ప్రమాదకర స్థాయిలో నమోదవుతోంది. తాజాగా శనివారం ఉదయం కూడా గాలి నాణ్యత సూచీ పేలవమైన స్థాయిలో నమోదైంది. సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం.. శనివారం ఉదయం రాజధాని(Delhi air pollution) ప్రాంతంలో ఓవరాల్‌ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌ (AQI) 245గా నమోదైంది.


మరోవైపు వాయు కాలుష్యం నివారించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కీలక చర్యలకు దిగింది. బీఎస్ 6(BS6 vehicle ban) నిబంధనలు పాటించని వాణిజ్య వాహనాలపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. వాయు కాలుష్యం పెరిగిపోవడం దృష్ట్యా ఢిల్లీలో ఎన్సీఆర్ లో గ్రాప్ 1 కాలుష్య నియంత్రణ చర్యలు అమలవుతున్నాయి. తాజాగా గ్రాప్-2(GRAP 2 Delhi)అమలు, నిర్మాణ పనులపై ఆంక్షలు విధించారు. బొగ్గు, కట్టెల వాడకం, డీజిల్ జనరేటర్ సెట్లపై నిషేధం ఉంది. ఈ వాయు కాలుష్యంతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్యం బారిన పడుతున్నారు. శ్వాసకోశ, ఛాతీలో నొప్పి, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలతో బాధ పడుతున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఎయిర్‌ క్వాలిటీ నివేదిక ప్రకారం.. గాలి నాణ్యత(AQI today) 447కు పడిపోవడం అంటే దాన్ని తీవ్ర వాయు కాలుష్యంగా పరిగణించవచ్చు. ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (ఏక్యూఐ) 0-100 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగా ఉండి, కాలుష్యం లేదని, ఏక్యూఐ 100-200 మధ్య ఉంటే గాలి నాణ్యత మధ్యస్తంగా ఉందని అర్థం. ఇక ఏక్యూఐ 200-300 మధ్య ఉంటే గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉందని, ఏక్యూఐ 300-400 మధ్య ఉంటే గాలి నాణ్యత(AQI today) మరింత దారుణంగా ఉందని సూచిస్తుంది.


ఇవి కూడా చదవండి:

మళ్లీ పాక్ ఏదైనా మూర్ఖపు చర్యకు దిగితే.. భారత ఆర్మీ చీఫ్ వార్నింగ్

Prashanth Kishore: ఇతర పార్టీలతో పొత్తులు ఉండవు: ప్రశాంత్ కిశోర్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 01 , 2025 | 11:29 AM