Share News

Pro Kabaddi League: విజేతగా ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో పుణేరి పల్టాన్‌పై విజయం!

ABN , Publish Date - Nov 01 , 2025 | 10:44 AM

ప్రొ కబడ్డీ సీజన్ 12 ఫైనల్ మ్యాచ్ ఆరంభం నుంచి ఆధిపత్యం చెలాయించిన ఢిల్లీ తొలి అర్ధభాగంలోనే పుణేరి పల్టాన్ ఒకసారి ఆలౌట్ చేసి 20-14తో ఆధిక్యంలో నిలిచింది. రైడింగ్‌లో 13 పాయింట్స్ సాధించిన దబాంగ్ ఢిల్లీ.. 3 ట్యాకిల్ పాయింట్స్ అందుకుంది.

Pro Kabaddi League: విజేతగా ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో పుణేరి పల్టాన్‌పై విజయం!
Pro Kabaddi League 2025

క్రీడా వార్తలు: ప్రొ కబడ్డీ సీజన్ 12 టైటిల్ ను దబాంగ్ ఢిల్లీ కైవసం చేసుకుంది. శుక్రవారం హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్ లో ఢిల్లీ 31-28 తేడాతో పుణేరి పల్టాన్‌‌ను ఓడించింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌ అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేసింది. మ్యాచ్(Pro Kabaddi League 2025) ఆరంభం నుంచి దబాంగ్ ఢిల్లీ ఆధిపత్యం చెలాయించింది. అయితే సెకండాఫ్‌లో అనూహ్యంగా తడబడింది. అనవసర ట్యాకిల్స్‌తో పాటు పేలవ రైడ్స్‌తో పాయింట్స్ సమర్పించుకోవడంతో పుణేరి పల్టాన్ రేసులోకి వచ్చింది. కానీ చివరి క్షణాల్లో పాయింట్స్ సాధించి ఢిల్లీ.. అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ఢిల్లీ( Dabang Delhi champions) రెండోసారి ఛాంపియన్‌గా నిలిచింది.


ప్రొ కబడ్డీ సీజన్ 12 (Pro Kabaddi League 2025)ఫైనల్ మ్యాచ్ ఆరంభం నుంచి ఆధిపత్యం చెలాయించిన ఢిల్లీ తొలి అర్ధభాగంలోనే పుణేరి పల్టాన్(Puneri Paltan) ఒకసారి ఆలౌట్ చేసి 20-14తో ఆధిక్యంలో నిలిచింది. రైడింగ్‌లో 13 పాయింట్స్ సాధించిన దబాంగ్ ఢిల్లీ(Dabang Delhi).. 3 ట్యాకిల్ పాయింట్స్ అందుకుంది. ఇక రెండో అర్ధభాగంలో మాత్రం దబాంగ్ ఢిల్లీ అనూహ్యంగా తడబడింది. రైడర్స్ విఫలమవ్వడంతో ప్రత్యర్థి చేతిలో ఒకసారి ఆలౌట్ అయ్యింది. దీంతో స్కోర్లు సమమై మ్యాచ్ పై అందరిలో ఉత్కంఠ పెంచింది. కానీ ఫజల్ అట్రాచలీ కీలక ట్యాకిల్ పాయింట్‌తో ఆధిక్యం అందించి విజయాన్ని ఖాయం చేశాడు. రెండో అర్ధభాగంలో ఢిల్లీ 4 రైడింగ్ పాయింట్స్‌తో పాటు 5 ట్యాకిల్ పాయింట్స్ సాధించగా.. పుణేరి 8 రైడింగ్ పాయింట్స్‌తో పాటు 3 ట్యాకిల్ పాయింట్స్ అందుకుంది.


తొలి అర్ధభాగంలోని వైఫల్యం పుణేరి పల్టాన్(Puneri Paltan) ఓటమిని ఖరారు చేసింది. ఢిల్లీకి ఇది రెండో టైటిల్‌. 2021లో తొలిసారి టైటిల్‌ గెలిచింది. 12 సీజన్లలో పాట్నా పైరేట్స్‌ అత్యధికంగా మూడుసార్లు నెగ్గింది. ఢిల్లీ(Dabang Delhi), జైపుర్, రెండేసి టైటిళ్లు సాధించగా.. యు ముంబా, పుణెరి పల్టాన్, హరియాణా స్టీలర్స్, బెంగళూరు బుల్స్, బెంగాల్‌ వారియర్స్‌ ఒక్కో ట్రోఫీ నెగ్గాయి. ఈ టోర్నీలో విజేత ఢిల్లీకి రూ.3 కోట్లు, రన్నరప్‌ పుణెరికి రూ.1.8 కోట్లు దక్కాయి. మరోవైపు ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన తెలుగు టైటాన్స్ క్వాలిఫయర్-2లోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే.



ఈ వార్తలు కూడా చదవండి:

IND vs AUS: రెండో టీ-20.. గెలుపు ఆసీస్‌దే..

Sunil Gavaskar: అదే జరిగితే జెమీమాతో కలిసి పాడతా: గావస్కర్

Updated Date - Nov 01 , 2025 | 10:44 AM