Asia Cup 2025 Trophy: రెండు రోజుల్లో భారత్‌కు ఆసియా కప్: బీసీసీఐ
ABN , Publish Date - Nov 01 , 2025 | 09:56 AM
నవంబర్ 4న ఐసీసీ త్రైమాసిక సమావేశం జరగనుంది. ఈలోగా నఖ్వీ.. ఆ ట్రోఫీని భారత్‌కు అప్పగించాలని, లేకపోతే ఈ విషయాన్ని ఐసీసీ (ICC) దృష్టికి తీసుకువెళతామని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా హెచ్చరించారు. దాదాపు నెల గడుస్తున్నా.. ఇప్పటికీ ఆసియా ట్రోఫీని భారత్ కు అందించలేదని సైకియా ఓ న్యూస్ ఏజెన్సీతో అన్నారు.
క్రీడా వార్తలు: ఆసియా కప్ 2025 ట్రోఫీ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి రోజూ ఏదో ఒక అప్ డేట్ వస్తూనే ఉంది. తాజాగా ఈ ట్రోఫీపై మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్(ACC) చీఫ్ నఖ్వీ రెండు రోజుల్లో ట్రోఫీ(Asia Cup 2025)ని భారత్‌కు అప్పగించే అవకాశముందని బీసీసీఐ (BCCI) ఆశాభావం వ్యక్తం చేస్తోంది. టీమిండియా ఆసియా కప్ గెల్చి.. నెలరోజులు గడుస్తున్నా.. ఇంకా ట్రోఫీ, మెడల్స్‌ను అందించకపోవడంపై బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా అసంతృప్తి వ్యక్తం చేశారు.
నవంబర్ 4న ఐసీసీ త్రైమాసిక సమావేశం(ICC meeting) జరగనుంది. ఈలోగా నఖ్వీ(ACC Chief Naghvi).. ఆ ట్రోఫీని భారత్‌కు అప్పగించాలని, లేకపోతే ఈ విషయాన్ని ఐసీసీ (ICC) దృష్టికి తీసుకువెళతామని దేవజిత్ సైకియాహెచ్చరించారు. దాదాపు నెల గడుస్తున్నా.. ఇప్పటికీ ఆసియా ట్రోఫీని భారత్ కు అందించలేదని సైకియా ఓ న్యూస్ ఏజెన్సీతో అన్నారు. అలాగే ట్రోఫీ విషయమై ఏసీసీకి లేఖ పంపిన విషయాన్నీ కూడా ఆయన ధ్రువీకరించారు. ఏసీసీ కార్యాలయంలోనే ట్రోఫీని తీసుకోవాలని తమకు బదులిచ్చినట్లు దేవజిత్ తెలిపారు. తాము ఏసీసీ ఛైర్మన్‌కు ఆసియా కప్ ట్రోఫీ విషయమై లేఖ పంపామని, అయినా పరిస్థితిలో ఏ మార్పూ రాలేదని అన్నారు. ఆసియా ట్రోఫీ ఇప్పటికీ నఖ్వీ స్వాధీనంలోనే ఉందని ఒకట్రెండు రోజుల్లో తప్పకుండా అది ముంబయిలోని బీసీసీఐ(BCCI) కార్యాలయానికి వస్తుందని సైకియా ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక ఆసియా కప్2025 విషయానికి వస్తే.. ఈ టోర్నీలో భారత్(Team India Asia Cup) మొత్తంగా మూడుసార్లు పాకిస్థాన్‌తో తలపడితే, అన్ని మ్యాచ్‌లనూ టీమిండియా గెలిచింది. ఫైనల్‌లోనూ పాక్‌పై గెలిచి.. ట్రోఫీని కైవసం చేసుకుంది. పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్ ఆడగాళ్లు, పాక్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు నిరాకరించారు. అలాగే ఆదేశానికే చెందిన ఏసీసీ చీఫ్ నఖ్వీ(ACC Chief Naghvi) చేతుల మీదుగా ట్రోఫీ అందుకునేందుకు కూడా ఇష్టపడలేదు. ఈ క్రమంలో నఖ్వీ పిల్ల చేష్టలకు పాల్పడ్డాడు. ట్రోఫీ, మెడల్స్‌ను మైదానం నుంచి తనతోపాటు తీసుకెళ్లాడు.
ఈ వార్తలు కూడా చదవండి: