Solid Gold Toilet: గోల్డ్ టాయిలెట్‌లో కూర్చుని.. వెళ్లి.. ఆస్వాదించాలనుందా..!
ABN , Publish Date - Nov 01 , 2025 | 09:29 AM
గోల్డ్ టాయిలెట్‌లో కూర్చుని.. వెళ్లి.. ఆస్వాదించాలనుందా.. అయితే, మీకు ఆ అవకాశం లభిస్తుంది. ఈ బంగారు లెట్రిన్‌ను అమెరికాలో వేలానికి పెట్టారు. దేవుడి పాట 10 మిలియన్ల..
ఇంటర్నెట్ డెస్క్: గోల్డ్ టాయిలెట్‌లో కూర్చుని.. వెళ్లి.. ఆస్వాదించాలనుందా.. అయితే, మీకు ఆ అవకాశం లభిస్తుంది. ఈ బంగారు లెట్రిన్‌ను అమెరికాలో వేలానికి పెట్టారు. దేవుడి పాట 10 మిలియన్ల అమెరికన్ డాలర్ల నుండి ప్రారంభమవుతుంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన టాయిలెట్ ఇది.
ఇటాలియన్ కళాకారుడు మౌరిజియో కాటెలాన్ ఈ బంగారు టాయిలెట్ రూపొందించాడు. 'అమెరికా' అనే పేరిట ఈ బంగారు తొట్టెని వేలం వేయనున్నట్లు సోథెబైస్ సంస్థ ప్రకటించింది. ఇది ఒక కళాత్మక ఉత్పత్తి అని సదరు వేలం సంస్థ అంటోంది. ఇది పూర్తిగా రోజువారీ వాడకానికి ఉపయోగపడే టాయిలెట్. 2019లో ఇంగ్లాండ్‌లోని బ్లెన్‌హీమ్ ప్యాలెస్ నుండి దోపిడీకి గురైన ప్రపంచ ఖ్యాతి పొందిన బంగారు టాయిలెట్ కు సరిసమానమైంది ఇదని చెబుతున్నారు.
న్యూయార్క్‌లో నవంబర్ 18న ఈ బంగారు తొట్టెని వేలానికి ఉంచుతారు. దీని ప్రారంభ ధరను.. దీనిని తయారు చేయడానికి ఉపయోగించిన 101.2 కిలోగ్రాముల (223 పౌండ్లు)బంగారం ధర అవుతుందో అంతే నిర్ణయించారు. దాని ప్రకారం ప్రస్తుతం దీని ఖరీదు దాదాపు $10 మిలియన్లు. ఇక, మీ ఓపికని బట్టి పోటీలో పాల్గొని ఆ బంగారు అద్భుతాన్ని పొందవచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి..
డిగ్రీ విద్యార్థిని అనుమానాస్పద మృతి
Hyderabad: బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై కేసు నమోదు