Share News

Beetroot Juice: ఉదయాన్నే ఈ జ్యూస్ తాగితే .. మెరిసే అందం మీ సొంతం..

ABN , Publish Date - Nov 01 , 2025 | 09:21 AM

బీట్ రూట్ లో యాంటీ ఆక్సిడెంట్లు, నైట్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ చర్మంలో రక్త ప్రసరణను పెంచడంలో సహాయపడుతుంది. విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉంటాయి. బీట్ రూట్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, కాంతివంతంగా కనిపించేందుకు సాయ పడుతుంది.

Beetroot Juice: ఉదయాన్నే ఈ జ్యూస్ తాగితే .. మెరిసే అందం మీ సొంతం..
beetroot juice

ఇంటర్నెట్ డెస్క్: తాజా పండ్లు, కూరగాయల్లో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని జ్యూస్ రూపంలో తీసుకోవడ వల్ల చర్మాన్ని కాపాడతాయి. అలానే పోషకాలు అధికంగా ఉండే జ్యూసులు మన శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేట్‌గా ఉంచుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాంటి జ్యూసుల్లో బీట్ రూట్(beetroot juice benefits) ఒకటి. ఉదయాన్నే బీట్‌రూట్ జ్యూస్‌ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.


బీట్ రూట్ లో యాంటీ ఆక్సిడెంట్లు, నైట్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ చర్మంలో రక్త ప్రసరణను పెంచడంలో సహాయపడుతుంది. విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉంటాయి. బీట్ రూట్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, కాంతివంతంగా కనిపించేందుకు సాయ పడుతుంది. మీ చర్మంపై ఉండే మృత కణాల్ని తొలగిస్తాయి. అలానే ఇది శరీరంలో రక్త ప్రసరణను పెంచి శరీరం నుండి వ్యర్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. బీట్ రూట్ జ్యూస్ చర్మం(beetroot juice for skin) ముడతలు, మచ్చలను తొలగించి.. చర్మాన్ని యవ్వనంగా, ప్రకాశవంతంగా ఉంచడంలో సాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బీట్ రూట్ జ్యూస్ వివిధ వ్యాధులను నివారిస్తుంది. ప్రతిరోజూ ఖాళీ కడుపుతో బీట్‌రూట్ జ్యూస్‌ త్రాగితే మలబద్ధకంతో సహా జీర్ణ సమస్యలు తొలుకుతాయి. బరువు తగ్గడంలో కూడాబీట్ రూట్ జ్యూస్ సాయపడుతుంది. ఈ జ్యూస్‌లో కొవ్వును కరిగించే గుణాలు ఉన్నాయి. అందువల్ల, బరువు(beetroot juice for weight loss) తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారు ప్రతిరోజూ ఖాళీ కడుపుతో బీట్‌రూట్ జ్యూస్‌ తాగితే ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ కేలరీలను బర్న్ చేయడంలో ఈ జ్యూస్ సహాయపడుతుంది.


బీట్‌రూట్ జ్యూస్‌ కొలెస్ట్రాల్‌ను నియంత్రించే లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది గుండెపోటు, గుండె(beetroot juice for heart)కు సంబంధించిన ఇతర సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. బీట్‌రూట్‌లో కొత్త రక్త కణాల ఉత్పత్తికి అవసరమైన ఇనుము, విటమిన్ బి12 వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల, రక్తహీనత వంటి సమస్యలతో బాధపడేవారు రోజూ ఉదయం(morning drinks) ఖాళీ కడుపుతో ఈ జ్యూస్‌ తాగడం ద్వారా రక్తహీనత సమస్యకు చెక్ పెట్టొచ్చు. బీట్‌రూట్‌లో అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల, ఇది శరీరంలో క్యాన్సర్ పెరుగుదలను నిరోధించడమే కాకుండా దానికి కారణమయ్యే కారకాలను కూడా తొలగిస్తుంది. అయితే జ్యూస్ ను అతిగా తాగడటం మీ ఆరోగ్యానికి మంచి కంటే ఎక్కువ హాని చేస్తుంది. కాబట్టి మితంగా తాగండ ఉత్తమమని వైద్య నిపుణులు చెబుతున్నారు.



ఈ వార్తలు కూడా చదవండి..

డిగ్రీ విద్యార్థిని అనుమానాస్పద మృతి

Hyderabad: బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీతపై కేసు నమోదు

Updated Date - Nov 01 , 2025 | 09:22 AM