Share News

Minor Attack on Mother: తల్లిని దారుణంగా చంపిన కూతురు.. ప్రియుడితో కలిసి బాబోయ్..

ABN , Publish Date - Oct 31 , 2025 | 09:11 PM

కర్ణాటకలో దారుణ ఘటన జరిగింది. ప్రియుడితో కలిసి తల్లినే హత్య చేసింది ఓ కూతురు. బెంగళూరు ఉత్తరహళ్లి ప్రాంతం సుబ్రహ్మణ్యపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

Minor Attack on Mother: తల్లిని దారుణంగా చంపిన కూతురు.. ప్రియుడితో కలిసి బాబోయ్..
Minor Attack on Mother

బెంగుళూరు, అక్టోబర్ 31: ప్రియుడితో కలిసి తల్లినే ఓ కూతురు హత్య చేసిన ఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. బెంగళూరు ఉత్తరహళ్లి ప్రాంతం సుబ్రహ్మణ్యపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. శనివారం(అక్టోబర్ 25) అర్ధరాత్రి తల్లి నేత్రావతి నిద్రిస్తున్న సమయంలో కూతురు తన ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది. ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో నిద్రలేచిన తల్లి.. వారిని రెడ్‌హ్యాండెడ్‌‌గా పట్టుకుంది. రాత్రి పూట పరాయి వ్యక్తితో ఇలాంటి పనులు చేయడం ఏంటని కూతురిపై నేత్రావతి తీవ్రంగా మండిపడింది. ఈ క్రమంలోనే తల్లి, కూతురి మధ్య గొడవ అయింది. గొడవ కాస్త ముదరడంతో అక్కడే ఉన్న ప్రియుడి దాడికి దిగాడు. గొడవ మరింత ముదరడంతో తన ముగ్గురు స్నేహితులను ప్రియుడు ఇంటికి పిలిపించాడు. వారంతా కలిసి నేత్రావతిని దారుణంగా హత్య చేశారు.


ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఆమె మెడకు చీర కట్టి ఆత్మహత్య చేసుకుందని తెలిసేలా ఉరేసుకున్నట్లు ఫ్యాన్ కు వేలాడదీశారు. అనంతరం ఆ రాత్రే అక్కడి నుంచి చెక్కేశారు. ఆ మరుసటి రోజు తెల్లవారింది. మృతిచెందిన మహిళ నేత్రావతి ఫోన్ ఎంతకీ కలవకపోవడంతో ఆమె అక్క, మేనకోడలు ఇంటికి వచ్చి చూశారు. ఈ ఘోరాన్ని కళ్లారా చూసిన వాళ్లు తీవ్రంగా విలపించారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్య కుట్ర గురించి తెలియక సుబ్రహ్మణ్యపుర పోలీసులు తొలుత అసహజ మరణ నివేదిక (UDR) నమోదు చేశారు.


నేత్రావతి కూతురు కనిపించకుండా పోవడంతో ఆమె అక్క, మేనకోడలు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. తల్లి అంత్యక్రియలకు కూడా కూతురు హాజరుకాలేదని పోలీసులకు తెలిపారు. దీంతో ఈ కేసు కోణం మలుపు తిరిగింది. ఆత్మహత్య కాదని.. హత్యే జరిగి ఉంటుందని, తల్లి చనిపోతే కూతురు ఎందుకు మిస్ అయిందని పలు సందేహాలతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పారిపోయిన కూతురు, ప్రియుడు, అతని ముగ్గురు స్నేహితులను పోలీసులు పట్టుకున్నారు. కేసు విచారణలో భాగంగా వారు నిజాన్ని ఒప్పుకున్నారు. తన తల్లిని తానే హత్య చేసినట్లు కూతురు ఒప్పుకుంది. ప్రియుడు, అతని ముగ్గురు స్నేహితులతో కలిసి చున్నీతో గొంతునులిమి చంపినట్లు ఒప్పుకుంది. హత్య చేసిన తరువాత ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఫ్యాన్‌కు చీరతో వేలాడదీసి అక్కడి నుంచి పారిపోయినట్లు తెలిపింది.


ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. నేత్రావతి కూతురు మైనర్ అని తెలిపారు. ఆమెకు తన ప్రియుడితో ఎప్పటి నుంచో సంబంధం ఉందని పేర్కొన్నారు. తరచుగా ఇంట్లో కలుసుకునేదని చెప్పారు. ఆ అమ్మాయి ప్రియుడు కూడా మైనర్ అని, అతని ముగ్గురు స్నేహితులూ మైనర్లని వెల్లడించారు. తమకు అడ్డుగా ఉన్న తల్లిని తొలగించుకునేందుకు ఈ దారుణానికి ఒడిగట్టారని చెప్పారు. ఈ ఐదుగురు మైనర్ నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. మృతిచెందిన మహిళ నేత్రావతిని చంపడానికి వీరు ముందుగానే ప్లాన్ చేసుకున్నారా? లేదా గొడవ జరగడంతో హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

PM Modi: మన ఆడకూతుళ్లు యుద్ధ విమానాలు నడుపుతున్నారు.. అంతర్జాతీయ ఆర్య మహా సమ్మేళన్‌లో మోదీ

Sanjay Raut: అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన సంజయ్ రౌత్

Updated Date - Oct 31 , 2025 | 09:34 PM