Tirupati: చిరుత సంచారం ఉంది.. గుంపులుగా వెళ్లండి
ABN , Publish Date - Nov 01 , 2025 | 10:51 AM
శ్రీనివాసమంగాపురం నుంచి తిరుమలకు కాలినడకన వెళ్లే శ్రీవారిమెట్టు మార్గంలో చిరుత సంచారంతో కలకలం రేగింది. శుక్రవారం ఉదయం 150వ మెట్టు వద్ద అటవీ ప్రాంతంలోకి చిరుత దాటుతుండగా భక్తులు చూసి భయాందోళనకు గురై కేకలు వేయడంతో పారిపోయింది.
- శ్రీవారిమెట్టు మార్గంలో మరోసారి చిరుత కలకలం
చంద్రగిరి(తిరుపతి): శ్రీనివాసమంగాపురం నుంచి తిరుమల(Tirumala)కు కాలినడకన వెళ్లే శ్రీవారిమెట్టు మార్గంలో చిరుత సంచారంతో కలకలం రేగింది. శుక్రవారం ఉదయం 150వ మెట్టు వద్ద అటవీ ప్రాంతంలోకి చిరుత దాటుతుండగా భక్తులు చూసి భయాందోళనకు గురై కేకలు వేయడంతో పారిపోయింది. అనంతరం భక్తులు టీటీడీ సెక్యూరిటీ(TTD Security)కి సమాచారమిచ్చారు.

టీటీడీ సెక్యూరిటీ అప్రమత్తమై భక్తులను గుంపులు గుంపులుగా తిరుమలకు అనుమతించారు. చిన్న పిల్లలను జాగ్రత్తగా తీసుకెళ్ళాలని సూచించారు. అటవీ అధికారులు ఆప్రాంతంలో ప్రత్యేక ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

గతంలోనూ 2024 సెప్టెంబరులో, ఈ ఏడాది జూన్‌లోనూ ఈ మార్గంలో చిరుత సంచిరించింది. ఈనేపధ్యంలో చిన్న పిల్లలున్న భక్తులను మధ్యాహ్నం 2 గంటల వరకే శ్రీవారిమెట్టు మార్గంలో అనుమతిస్తున్నారు. టీటీడీ అధికారులు శ్రీవారిమెట్టు మార్గంలో కాలినడకన తిరుమలకు వెళ్ళే భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకుని, అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
డిగ్రీ విద్యార్థిని అనుమానాస్పద మృతి
Read Latest Telangana News and National News