Home » Thug Life
Thug Life release SC: కర్ణాటకలో థగ్ లైఫ్ సినిమాపై నిషేధం విధించడంపై సుప్రీం కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. హైకోర్టు తీర్పునూ తప్పుబడుతూ.. రిలీజ్ కు అనుమతించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందంటూ సినీ నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్య కర్ణాటకలో పెద్ద దుమారమే రేపుతోంది. తాను క్షమాపణ చెప్పనంటూ కమల్ కోర్టుకెక్కడంతో ఈ వివాదం తగ్గే సూచనలు కనిపించడం లేదు.
కమల్‌హాసన్ వ్యాఖ్యలతో తాను ఏకీభవించడం లేదని ఆదివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ శివ రాజ్‌కుమార్ చెప్పారు. అన్ని భాషలూ మనకు ముఖ్యమేనని, అయితే మాతృభాష విషయానికి వచ్చేసరికి కన్నడానికే తమ మొదట ప్రాధాన్యత అని అన్నారు.
కమల్‌హాసన్ ఇటీవల చెన్నైలో జరిగిన 'థగ్ లైఫ్' చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంలో మాట్లాడారు. కన్నడ భాష కూడా తమిళం నుంచే పుట్టిందని ఈ సందర్భంగా అన్నారు. ఆయన వ్యాఖ్యలు కన్నడ నాట దుమారం రేపాయి.