Share News

Thug Life Ban: థగ్ లైఫ్ కు 'లైఫ్' ఇచ్చిన సుప్రీంకోర్టు.. కర్ణాటక ప్రభుత్వానికి కౌంటర్!

ABN , Publish Date - Jun 17 , 2025 | 01:06 PM

Thug Life release SC: కర్ణాటకలో థగ్ లైఫ్‌ సినిమాపై నిషేధం విధించడంపై సుప్రీం కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. హైకోర్టు తీర్పునూ తప్పుబడుతూ.. రిలీజ్ కు అనుమతించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Thug Life Ban: థగ్ లైఫ్ కు 'లైఫ్' ఇచ్చిన సుప్రీంకోర్టు.. కర్ణాటక ప్రభుత్వానికి కౌంటర్!
Supreme Court Ordered Karnataka Government to Release Thug Life

SC Karnataka Thug Life release: కమల్ హాసన్ కు బిగ్ రిలీఫ్ దక్కింది. కర్ణాటకలో తమిళ చిత్రం 'థగ్ లైఫ్' రిలీజ్ విషయంలో ప్రభుత్వం, హైకోర్టు ఆంక్షలు విధించడంపై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అల్లరిమూకలు రోడ్లపైకి వచ్చి సినిమా విడుదలను అడ్డుకోవాలని నినాదాలు చేయడం సరికాదని జస్టిస్ ఉజ్జల్ భూయాన్, మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. కమల్ హాసన్ చిత్రం 'థగ్ లైఫ్' విడుదలకు వెంటనే అనుమతించాలని సుప్రీంకోర్టు మంగళవారం కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది.


కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీం ఆదేశం..

కర్ణాటకలో కమల్ హాసన్ 'థగ్ లైఫ్' రిలీజ్ కు లైన్ క్లియర్ అయింది. మంగళవారం చిత్రనిర్మాతలు కర్ణాటకలో సినిమా విడుదలకు అనుమతి కోరుతూ దాఖలు చేసిన పిల్ ను సుప్రీంకోర్టు విచారించింది. జస్టిస్ ఉజ్జల్ భూయాన్, మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం థగ్ లైఫ్ విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం కర్ణాటక ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించింది. ఎక్స్‌ట్రా-జ్యుడీషియల్ నిషేధం పేరిట కర్ణాటక హైకోర్టు తీర్పు ఇవ్వడాన్ని తప్పుబట్టింది. కర్ణాటక హైకోర్టు కమల్ హాసన్‌ను క్షమాపణ అడగాల్సి ఉండకూడదని అభిప్రాయపడింది. 'థగ్ లైఫ్' కేసును సుప్రీంకోర్టుకు బదిలీ చేయడంపై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది.


అల్లరి మూకలు వీధుల్లోకి వచ్చి విధ్వంసం సృష్టించడాన్ని సహించబోమని.. చట్టబద్ధమైన పాలన చేయడమే ప్రభుత్వాల కర్తవ్యమని గుర్తుచేసింది. CBFC సర్టిఫికేట్ ఉన్న సినిమా దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ విడుదల చేయాలని చట్ట నియమం చెబుతోంది. సినిమా విడుదలను నిలిపివేసి, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా సినిమా హాళ్లను తగలబెట్టేస్తామని బెదిరించడానికి ఆస్కారం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. బుధవారం లోగా తన ప్రతిస్పందనను తెలియజేయాలని సుప్రీం కోర్టు కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. తమిళం నుంచి కన్నడ పుట్టిందంటూ కమల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో కర్ణాటకలో థగ్ లైఫ్ సినిమాపై బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే.


ఈ వార్తలు కూడా చదవండి.

గరిష్టానికి చేరుకుని, మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు

‘ధరణి’పై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ షురూ

Read Latest Telangana News and National New

Updated Date - Jun 17 , 2025 | 01:40 PM