Share News

National Medical Commission Scam: నేషనల్ మెడికల్ స్కామ్.. ఎఫ్‌ఐఆర్‌‌లో 36 మంది పేర్లు

ABN , Publish Date - Jul 04 , 2025 | 02:07 PM

National Medical Commission Scam: ఎఫ్‌ఐఆర్‌లో ఏపీ, తెలంగాణకు చెందిన డాక్టర్ల పేర్లు కూడా ఉన్నాయి. వరంగల్, విశాఖకు చెందిన కాలేజీల డైరెక్టర్లపైనా కేసులు పెట్టారు. మెడికల్‌ కాలేజీల్లో తనిఖీల సమాచారాన్ని ముందుగానే కాలేజీలకు పలువురు ఎన్‌ఎంసీ సభ్యులు చేరవేస్తున్నారు.

National Medical Commission Scam: నేషనల్ మెడికల్ స్కామ్.. ఎఫ్‌ఐఆర్‌‌లో 36 మంది పేర్లు
National Medical Commission Scam

హైదరాబాద్, జులై 4: నేషనల్ మెడికల్ కమిషన్ స్కామ్ కేసులో (National Medical Commission Scam) కీలక విషయాలు వెలుగు చూశాయి. దేశవ్యాప్తంగా 36 మంది పేర్లను సీబీఐ‌ (CBI) ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది. ఎన్ఎంసీ సభ్యులు, కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులపై కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో ఏపీ, తెలంగాణకు చెందిన డాక్టర్ల పేర్లు కూడా ఉన్నాయి. వరంగల్, విశాఖకు చెందిన కాలేజీల డైరెక్టర్లపైనా కేసులు పెట్టారు. మెడికల్‌ కాలేజీల్లో తనిఖీల సమాచారాన్ని ముందుగానే కాలేజీలకు పలువురు ఎన్‌ఎంసీ సభ్యులు చేరవేస్తున్నారని... సమాచారం ఇచ్చినందుకు ఎన్ఎంసీ సభ్యులకు లంచాలు ఇస్తున్నారని సీబీఐ దర్యాప్తులో వెల్లడించింది. అటు తనిఖీల సమాచారంతో అప్రమత్తమవుతున్న కాలేజీలు... అద్దె ఫ్యాకల్టీతో ఎన్‌ఎంసీని ఏమార్చుతున్నాయని విచారణలో బయటపడింది.


జూన్ 30న ఆధారాలన్నీ సేకరించిన తర్వాత సీబీఐ విచారణలో వచ్చిన సమాచారం ఆధారంగా మొత్తం 36 మందిపై కేసు నమోదు చేశారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదు మందిపై కేసు నమోదు అయ్యింది. ఏపీకి చెందిన డాక్టర్ హరిప్రసాద్‌పై కేసు నమోదు అయ్యింది. విశాఖపట్నం అక్కయ్యపాలెంకు చెందిన డాక్టర్ కిషోర్ కుమార్‌పై కూడా కేసు ఫైల్ చేశారు. అటు విశాఖపట్నం గాయత్రి మెడికల్ కళాశాల డైరెక్టర్‌గా ఉన్న వెంకట్, తెలంగాణలో వరంగల్‌‌కు చెందిన జోసెఫ్ కొమ్మిరెడ్డిపై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది.


ఇవి కూడా చదవండి

బీజేపీకి మహిళా అధ్యక్షురాలు.. రేసులో ఉంది వీరే

సిగాచి ఘటన.. మరొకరు మృతి.. ప్రమాద స్థలికి హైలెవల్ కమిటీ

Read latest National News And Telugu News

Updated Date - Jul 04 , 2025 | 02:28 PM