Share News

Bengaluru News: ఆ.. రైతును అల్లనేరేడు ఆదుకుంది..

ABN , Publish Date - Jul 04 , 2025 | 12:57 PM

మండలంలోని నరసాపురం గ్రామానికి చెందిన రైతు హరిదాస్‌ చౌదరి అల్లనేరేడు పంటతో అధిక లాభాలు గడిస్తున్నాడు. పుష్కర కాలం కిందట ఆర్డీటీ పంపిణీ చేసిన బహు డోలి రకం అల్లనేరేడు మొక్కలు ఒక్కోటి రూ.40లతో కొనుగోలు చేశాడు.

Bengaluru News: ఆ.. రైతును అల్లనేరేడు ఆదుకుంది..

- ఆదాయంలో నేరేడు

- మూడెకరాల్లో సాగు చేసిన రైతు

- ఏడాదికి రూ.ఆరు లక్షల లాభం

- ఔషధ గుణాలతో పెరుగుతున్న డిమాండ్‌

బెళుగుప్ప(బెంగళూరు): మండలంలోని నరసాపురం(Narasapuram) గ్రామానికి చెందిన రైతు హరిదాస్‌ చౌదరి అల్లనేరేడు పంటతో అధిక లాభాలు గడిస్తున్నాడు. పుష్కర కాలం కిందట ఆర్డీటీ పంపిణీ చేసిన బహు డోలి రకం అల్లనేరేడు మొక్కలు ఒక్కోటి రూ.40లతో కొనుగోలు చేశాడు. మూడు ఎకరాలలో 140 మొక్కలను 20-20 దూరంలో నాటి బోరుబావి నీటితో సంరక్షించాడు. ఐదేళ్లకు పంట చేతికొచ్చింది. పూత, కాయలకు పురుగు ఆశించకుండా క్రిమి సంహారక మందులు పిచికారీ చేస్తున్నట్లు తెలిపాడు.


pandu3.2.jpg

మూడు ఎకరాలకు పురుగుమందులు, ఎరువులు, కూలీ ఖర్చు అన్నీ కలిపి ప్రతి ఏటా రూ. 80 వేల నుంచి రూ.90 వేలు పెట్టుబడి వస్తుందని రైతు తెలిపారు. దిగుబడి, మార్కెట్‌లో ధరను బట్టి ఏడాదికి ఐదారు లక్షల రూపాయాల ఆదాయం వస్తున్నట్లు తెలిపారు. ఈ యేడాది తోటలోనే రూ.ఆరు లక్షలకు వ్యాపారులకే విక్రయించినట్లు తెలిపారు. పంట దిగుబడిని బట్టి ధరలో మార్పు ఉంటుందన్నారు. నేరేడు పండ్లు మధుమేహం, జీర్ణక్రియ, మెదడు, గుండెకు ఔషధంగా పని చేస్తాయన్న నమ్మకంతో మార్కెట్‌లో డిమాండ్‌ పెరుగుతోందన్నారు.


pandu3.3.jpg

ఉద్యాన పంటలే మేలు

మెట్ట భూముల్లో వర్షాధార పంటలు సాగు చేసి అప్పులపాలయ్యాం. కష్టాల్లో ఉన్న రైతులకు ఉద్యాన పంటలు ఎంతో ఆదాయాన్నిస్తున్నాయి. నా కుమారుడు శశిధర్‌ సహకారంతో 15 ఎకరాలలో మామిడి, అల్లనేరేడు, అరటి పంట సాగు చేస్తున్నాం. గిట్టుబాటు ధరతో పాటు మార్కెటింగ్‌ సౌకర్యం ఉంటే ఉద్యాన పంటల సాగు ఎంతో లాభదాయకం.

- హరిదాస్‌ చౌదరి, నరసాపురం


ఈ వార్తలు కూడా చదవండి.

కాటేదాన్‌ రబ్బర్‌ కంపెనీలో అగ్ని ప్రమాదం

రిజర్వేషన్లు అమలు తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి

Read Latest Telangana News and National News

Updated Date - Jul 04 , 2025 | 12:57 PM