Share News

Bengaluru News: ప్రతిపక్ష నేత ఎద్దేవా.. మరో మూడేళ్లు సీఎంగా సిద్దరామయ్య.. అదే ఆరో గ్యారెంటీ

ABN , Publish Date - Jul 04 , 2025 | 12:26 PM

ఇదే ఏడాది అక్టోబరు లేదా నవంబరులో ముఖ్యమంత్రి మార్పు ఉంటుందని కానీ మరో మూడేళ్లు సిద్దరామయ్య సీఎంగా కొనసాగుతారంటే ఇది గ్యారెంటీగా ప్రతిపక్షనేత అశోక్‌(Ashok) ఎద్దేవా చేశారు.

Bengaluru News: ప్రతిపక్ష నేత ఎద్దేవా.. మరో మూడేళ్లు సీఎంగా సిద్దరామయ్య.. అదే ఆరో గ్యారెంటీ

- ప్రతిపక్ష నేత అశోక్‌ ఎద్దేవా

బెంగళూరు: ఇదే ఏడాది అక్టోబరు లేదా నవంబరులో ముఖ్యమంత్రి మార్పు ఉంటుందని కానీ మరో మూడేళ్లు సిద్దరామయ్య సీఎంగా కొనసాగుతారంటే ఇది గ్యారెంటీగా ప్రతిపక్షనేత అశోక్‌(Ashok) ఎద్దేవా చేశారు. గురువారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలకు భయం వేస్తోందన్నారు. ప్రస్తుతం ఆపార్టీ రాష్ట్ర పరిస్థితి ఇల్లు ఒక్కటే కానీ తలుపులు మూడు అనేలా మారిందన్నారు.


అందరూ సీఎం కావాలని భావిస్తున్నారని అదే సమస్యగా మారిందన్నారు. సిద్దరామయ్య(Siddaramaiah) మరో మూడేళ్లు కొనసాగుతారని అధిష్ఠానం చెప్పాలి కానీ ఎందుకో ఇటీవల పదేపదే సిద్దరామయ్య అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారన్నారు. ఇక డీసీఎం డీకే శివకుమార్‌(DCM DK Shivakumar) కూడా నేను సీఎం సిద్దరామయ్యకు అండగా ఉంటానని బహిరంగంగా ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు.


pandu2.2.jpg

అధికారాన్ని తన్ని లాగేసుకుంటానని పలుమార్లు చెప్పిన డీకే శివకుమార్‌ ఎందుకో వెనకబడ్డారన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే బెంగళూరు యూనివర్సిటీకి పెట్టిన మన్‌మోహన్‌సింగ్‌ పేరును మారుస్తామన్నారు. చరిత్రాత్మకంగా ఉన్న పేర్లను చిన్నపాటి కారణాలు చూపి మార్చడం సరికాదన్నారు. అభివృద్ధి చేయాలి కానీ బోర్డులు మార్చడం ఏమిటని ప్రశ్నించారు. కులగణనలో సిద్దరామయ్యకు చుక్కెదురయ్యిందన్నారు.


మరోసారి సర్వే జరిపితే దానికి విలువ ఉండదన్నారు కులగణన చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి అధికారం లేదన్నారు. ఆర్‌ఎ్‌సఎ్‌సను నిషేధిస్తే సంఘటనలు మరో చరిత్ర సృష్టిస్తాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు ఎన్నోరాష్ట్రాల గవర్నర్‌లు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు ఎందరో ఆర్‌ఎస్ఎస్‏కు చెందినవారు ఉన్నారన్నారు. ఆర్‌ఎ్‌సఎస్‌ గురించి తెలుసుకుని మాట్లాడాలంటూ హితవు పలికారు. అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగంలో లేని పదాలను చేర్చారని ఇందుకు కాంగ్రెస్‌ సమాధానం చెప్పాలన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

కాటేదాన్‌ రబ్బర్‌ కంపెనీలో అగ్ని ప్రమాదం

రిజర్వేషన్లు అమలు తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి

Read Latest Telangana News and National News

Updated Date - Jul 04 , 2025 | 12:26 PM