Madras High Court: డ్రగ్స్ కేసులో నటుడు శ్రీకాంత్, కృష్ణకు బెయిల్
ABN , Publish Date - Jul 09 , 2025 | 01:22 PM
డ్రగ్స్ కేసులో నటులు శ్రీకాంత్, కృష్ణకు మద్రాస్ హైకోర్ట్ షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. చిత్ర పరిశ్రమలో కలకలం రేపిన డ్రగ్స్ కేసులో నటులు శ్రీకాంత్, కృష్ణకు మద్రాస్ హైకోర్ట్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

చెన్నై: డ్రగ్స్ కేసులో (Drugs Case) నటులు శ్రీకాంత్, కృష్ణకు మద్రాస్ హైకోర్ట్ షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. చిత్ర పరిశ్రమలో కలకలం రేపిన డ్రగ్స్ కేసులో నటులు శ్రీకాంత్, కృష్ణకు మద్రాస్ హైకోర్ట్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. డ్రగ్స్ సేవించిన ఆరోపణలతో గత జూన్‌లో శ్రీకాంత్, కృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరి వ్యక్తిగత బెయిల్ పిటిషన్లపై ఇవాళ(బుధవారం) మద్రాస్ హైకోర్టులో విచారణ జరిగింది.
మరోవైపు, ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతోంది. జూన్ 23వ తేదీన శ్రీకాంత్‌ను చెన్నై నగరంలోని డ్రగ్ నెట్‌వర్క్‌లో పాలుపంచుకున్నారనే ఆరోపణలతో నంగనల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారం రోజుల తర్వాత కృష్ణ, ఆయన సహచరుడిని కూడా అదే కేసులో బ్యాంక్ లావాదేవీలు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా పోలీసులు అరెస్ట్ చేశారు. మద్రాసు హై కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో నటులు శ్రీకాంత్, కృష్ణ విడదల అయ్యారు.
పాక్‌కు చైనా సాయం.. కథ మొత్తం బయటపెట్టిన భారత్!
రూ.200 మోసం చేశాడు.. కట్ చేస్తే 30 ఏళ్ల తర్వాత ఊహించని షాక్..
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి