Boycott Turkey: తుర్కియేకు దెబ్బ మీద దెబ్బ.. బాయ్‌కాట్ చేసిన జ్యువెలరీ వ్యాపారులు..
ABN , Publish Date - May 16 , 2025 | 07:09 PM
Turkish Jewellery Boycott India: పాకిస్థాన్‌కు బహిరంగంగా మద్ధతిచ్చిన తుర్కియేపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ‘బాయ్‌కాట్ తుర్కియే’ (Boycott Turkey) ట్రెండ్ అవుతుండగా.. భారతదేశ జ్యువెలరీ వ్యాపారులు మరో భారీ షాకిచ్చారు.

Jewellers Boycott Turkish Jewellery In India: పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్‌కు అండగా నిలిచి సహాయం చేసిన తుర్కియేకి మరో పెద్ద షాక్. భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తత సమయంలో పాకిస్థాన్‌కు మద్దతు ఇచ్చినందుకు గానూ ఆ దేశానికి తగిన బుద్ధి చెప్పే దిశగా ఇండియాలోని వ్యాపారులు, సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే ‘బాయ్‌కాట్ తుర్కియే’ (Boycott Turkey) అంటూ పర్యాటకులు ప్రయాణాలు రద్దు చేసుకున్నారు. ట్రావెల్ ఏజెన్సీలు కూడా ప్రయాణీకులకు మద్ధతుగా నిలిచి బుకింగ్స్ నిలిపేశాయి. విద్య, వ్యాపారాలు, పర్యాటకం ఇలా ప్రతి రంగం వారూ తుర్కియే ఆదాయం పొందకూడదనే ఏకాభిప్రాయంతో చర్యలు చేపడుతున్నారు. తాజాగా, తుర్కియేకు అతి పెద్ద ఆదాయ వనరుగా ఉన్న టర్కిష్ డిజైన్లు, అమ్మకాలను మన దేశ జ్యువెలరీ వ్యాపారులు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.
అన్ని రంగాలు ఏకతాటిపైకి..
రెండేళ్ల క్రితం భారీ భూకంపంతో ఛిన్నాభిన్నమైన తుర్కియేకు ఆపనహస్తం అందించిన ఇండియా. అది మర్చిపోయి దాయాది దేశంతో చేతులు కలిపి విషనాగులా బుసలు కొట్టింది తుర్కియే. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రపంచ దేశాలూ ఇండియావైపు నిలిస్తే తుర్కియే, అజర్ బైజాన్ మాత్రం పాకిస్థాన్ కు వత్తాసు పలికాయి. భారత్‌తో పోరుకు డ్రోన్లు, ఆయుధాలు, సైన్యం సరఫరా చేసి సహకరించాయి. దీంతో ఇండియాలో ఒకరి తర్వాత మరొకరు తుర్కియే, అజర్ బైజాన్ తో ఉన్న వ్యాపార సంబంధాలు, ట్రావెల్, టూరిజం ఇలా అన్ని సంబంధాలను తెగతెంపులు చేసుకుంటున్నారు. తాజాగా, దేశవ్యాప్తంగా ఉన్న జ్యువెలరీ వ్యాపారులు ఏకతాటిపై నిలిచి టర్కిష్ డిజైన్లు, అమ్మకాలను బాయ్‌కాట్ చేశారు.
మద్ధతు ఇచ్చినంత కాలం ఇంతే..
వాస్తవానికి దేశంలో పలుచోట్ల టర్కిష్ ఆభరణాలకు మంచి గిరాకీ ఉంది. ఈ ఏడాది అక్షయ తృతీయ సందర్భంగా ఇవే అత్యధికంగా అమ్ముడయ్యాయి. అయినప్పటికీ దేశవ్యాప్తంగా ఉన్న జ్యువెలరీ వ్యాపారులు తుర్కియే నుంచి ఆభరణాలు దిగుమతి చేసుకోకూడదని నిర్ణయించుకున్నారు. వాణిజ్యం కంటే దేశమే మిన్న అని ప్రకటిస్తూ భారత జెమ్ అండ్ జ్యువెలరీ మద్ధతుగా నిలిచింది. ఇప్పటికే అన్ని చోట్లా తుర్కియే ఆభరణాల అమ్మకాలు, దిగుమతులు పూర్తి ఆపేశారు. ఆర్డర్లు కూడా రద్దు చేసుకున్నారు. తుర్కియే పాక్ కు మద్ధతు ఇచ్చినంత కాలం టర్కీ వస్తువులను దిగుమతి చేసుకోకూడదని జ్యువలెరీ వ్యాపారులు ప్రతిన పూనారు. జూలై 25న జరగనున్న ఇండియా ఇంటర్నేషనల్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ నిర్వాహకులు టర్కిష్ వ్యాపారులకు స్టాల్స్ ఇవ్వకూడదని కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇక, ఉదంపూర్ పాలరాయి మార్కెట్ కూడా తుర్కియేతో వాణిజ్య సంబంధాలను తెంచుకుంది. ఆసియాలోనే అతిపెద్ద పాలరాతి మార్కెట్ అయిన ఉదంపూర్ ఏటా 14 లక్షల టన్నుల పాలరాయిని దిగుమతి చేసుకుంటుంది. పాకిస్థాన్ కు మద్ధతు ఇచ్చిన కారణంగా ఏడాదికి దాదాపు రూ.5వేల కోట్ల వ్యాపారాన్ని వదులుకునేందుకు ఉదయపూర్ మార్బుల్ ప్రాసెసర్స్ కమిటీ సిద్ధపడింది. ఇంకా తుర్కియేకు వ్యతిరేకంగా దిల్లీలోని జేఎన్‌యూ, జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ, ఐఐటీ రూర్కీ, కాన్పుర్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం ఒప్పందాలను రద్దు చేసుకున్నాయి. మరో వైపు హిమాచల్ రైతులు కూడా తుర్కియే యాపిల్స్ పై 100% పన్ను విధించాలని ప్రధాని మోదీకి లేఖ రాశారు.
Read Also: Celebi: మోదీ సర్కారుపై కోర్టుకెక్కిన టర్కిష్ సంస్థ సెలెబి
Madhya Pradesh: భారత ఆర్మీపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఈసారి డిప్యూటీ సీఎం
Indus Water Treaty: తుల్‌బుల్‌పై ఒమర్, మెహబూబా మాటల తూటాలు..