Share News

IRCTC Dubai Tour Package : పర్యాటకులకు అదిరిపోయే ఆఫర్.. అతి తక్కువ ఖర్చుతోనే..6 రోజుల దుబాయ్ టూర్‌

ABN , Publish Date - Jan 28 , 2025 | 03:29 PM

పర్యాటకులకు అదిరిపోయే ఆఫరిచ్చింది ఐఆర్‌సీటీసీ. టికెట్ సహా అన్ని ఖర్చులూ కలిపి లక్షలోపు బడ్జెట్‌తోనే 6 రోజుల పాటు దుబాయ్‌ చుట్టేసే అవకాశం కల్పిస్తోంది..

IRCTC Dubai Tour Package : పర్యాటకులకు అదిరిపోయే ఆఫర్.. అతి తక్కువ ఖర్చుతోనే..6 రోజుల దుబాయ్ టూర్‌
IRCTC Dubai Tour Package Details

IRCTC Dubai Tour Package : పర్యాటకులకు అదిరిపోయే ఆఫరిచ్చింది ఐఆర్‌సీటీసీ. టికెట్ సహా అన్ని ఖర్చులూ కలిపి లక్షలోపు బడ్జెట్‌తోనే 6 రోజుల పాటు దుబాయ్‌ చుట్టేసే అవకాశం కల్పిస్తోంది. సాధారణంగా లక్షలోపు బడ్జెట్‌తో 6 రోజులు దుబాయ్ టూర్ వెళ్లాలంటే అసాధ్యమే. టికెట్ ఖర్చే ఒక్కొక్కరికీ లక్షపైన ఉంటుంది. దీనికి మిగతా ఖర్చులు అదనం. అయితే, టికెట్ ఖర్చుతో పాటు అన్ని ఖర్చులూ కలిపి దుబాయ్ టూర్ ప్యాకేజీ పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చింది ఐఆర్‌సీటీసీ. మరి, ఆ ప్యాకేజీ వివరాలు ఏంటో తెలుసుకుందాం..


పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో భాగంగా దేశ, విదేశాల్లోని పర్యాటకుల కోసం వివిధ టూర్ ప్యాకేజీలను అందిస్తోంది ఐఆర్‌సీటీసీ. తాజాగా పర్యాటకుల కోసం దుబాయ్ టూర్ ప్యాకేజీని ప్రవేశపెట్టింది. ఈ ప్యాకేజీలో అత్యంత తక్కువ ఖర్చుతో ఆరు రోజుల పాటు పర్యాటకులు దుబాయ్‌లోని వివిధ ప్రదేశాలను సందర్శించవచ్చు. ఈ టూర్ ప్యాకేజీ ఫిబ్రవరిలో ప్రారంభమవుతుంది. IRCTC టూర్ ప్యాకేజీలలో పర్యాటకులకు వసతి, ఆహారం ఉచితం అనే సంగతి తెలిసిందే.


ఐఆర్‌సీటీసీ దుబాయ్ టూర్ ప్యాకేజీ వివరాలు..

ఐఆర్‌సీటీసీ దుబాయ్ టూర్ ప్యాకేజీ అమృత్‌సర్ నుంచి ప్రారంభమవుతుంది. ఈ టూర్ ప్యాకేజీ 5 రాత్రులు, 6 పగళ్లు ఉంటాయి ఈ టూర్‌లో పర్యాటకులు దుబాయ్, అబుదాబీలను సందర్శిస్తారు. టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.94,785గా నిర్ణయించారు. IRCTC అధికారిక వెబ్‌సైట్ ద్వారా పర్యాటకులు ఈ టూర్ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు. ఇది కాకుండా, పర్యాటకులు 7888696843 నంబర్‌కు కాల్ చేయడం ద్వారా కూడా టూర్ ప్యాకేజీలను బుక్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమవుతుంది. టికెట్ బుక్ చేసుకున్న పర్యాటకులు దుబాయ్‌కు విమానంలో చేరుకుంటారు.


ప్యాకేజీ ఛార్జీలు..

ఈ టూర్‌లో మీరు ఒంటరిగా ప్రయాణిస్తుంటే మీరు ఒక్కొక్కరికి రూ.116865 చెల్లించాలి. ఇద్దరు వ్యక్తులతో కలిసి ప్రయాణిస్తే ఒక్కొక్కరికి రూ.96,990 మాత్రమే ఖర్చవుతుంది. ముగ్గురితో ప్రయాణిస్తే ఒక్కో వ్యక్తికి రూ.94,785 చెల్లించాల్సి ఉంటుంది. 5 నుంచి 11 ఏళ్లలోపు పిల్లలకు బెడ్‌ సౌకర్యంతో కూడిన టూర్‌ ప్యాకేజీ ఛార్జీ రూ.93,125. బెడ్‌ లేకుండా అయితే రూ.80,430గా నిర్ణయించారు.

Updated Date - Jan 28 , 2025 | 03:29 PM