Home » Indian Railways
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో ఆక్యుపెన్సీ రేషియో 100కు పైగానే ఉందని కేంద్ర మంత్రి పార్లమెంటులో వెల్లడించారు. ఈ ఏడాది జూన్ వరకూ ఆక్యుపెన్సీ రేషియో 105.03 శాతంగా ఉందని తెలిపారు.
కన్యాకుమారి-పూణె జయంతి ఎక్స్‌ప్రెస్‌లోని ఓ బోగీలో అకస్మాత్తుగా పొగలు రేగడం చూసి ప్రయాణికులు హడలిపోయారు. నందలూరు వద్ద రైలును ఆపిన సిబ్బంది తనిఖీలు నిర్వహించగా సాంకేతిక లోపం బయటపడింది. రిపేర్ల అనంతరం రైలు యథావిధిగా గమ్యస్థానానికి బయలుదేరింది.
భారత రైల్వే ప్రయాణికులకు మరో కొత్త మార్పు వచ్చింది. రైల్వే మంత్రిత్వ శాఖ ఎమర్జెన్సీ కోటా నియమాలలో తాజాగా పలు సవరణలు ప్రకటించింది. ఇప్పటి వరకు ఎమర్జెన్సీ కోటా కోసం కొన్ని రోజుల ముందే అభ్యర్థనలు స్వీకరిస్తుండగా, ఇక నుంచి ఈ ప్రక్రియ మరింత కఠినతరం కానుంది.
ప్రయాణికులకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గుడ్ న్యూస్ చెప్పారు. వెయ్యి కొత్త రైల్వే సర్వీసులను పట్టాలు ఎక్కిస్తున్నట్లు ప్రకటించారు. రైలు ప్రమాదాలు సైతం గణనీయంగా తగ్గాయన్నారు.
రైలు టికెట్లను రద్దు చేసినప్పుడు ఇచ్చే రీఫండ్ మొత్తాన్ని పెంచేందుకు భారతీయ రైల్వే యోచిస్తోంది.
Youtuber Kanika Devrani: యూట్యూబర్ కనికా దేవ్రాణి బ్రహ్మపుత్రా రైలులో ప్రయాణిస్తూ ఉంది. పశ్చిమ బెంగాల్ న్యూ జల్పాయ్గురి జంక్షన్లో రైలు ఆగింది. ఓ వ్యక్తి కనికా ఉన్న కంపార్ట్మెంట్లోకి ఎక్కాడు.
రైల్వేలో ఖాళీగా ఉన్న 6,374 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి చర్యలు ప్రారంభమయ్యాయి. సిగ్నల్, టెలికమ్యూనికేషన్ సహా 51 కేటగిరీల్లోని గ్రేడ్ -సి పోస్టులు భర్తీ కానున్నాయి.
తత్కాల్ టికెట్లకు సంబంధించి రైల్వే శాఖ మరో కొత్త నిబంధనను అమల్లోకి తీసుకురాబోతోంది. ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్‌లో ఆధార్ అథంటికేటెడ్ వ్యక్తులకే తత్కాల్ టికెట్ బుకింగ్ సదుపాయం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. జులై 1వ తేదీ నుంచి ఈ నిబంధన అమలు చేయబోతున్నట్టు ప్రకటించింది.
సైనిక రైళ్లకు సంబంధించిన సమాచారాన్ని అనధికార వ్యక్తులతో పంచుకోవద్దని రైల్వే శాఖ తమ ఉద్యోగులను హెచ్చరించింది. ఇందుకు సంబంధించిన అడ్వయిజరీ ఈనెల 6న జారీ చేసింది.
దేశంలోని తొలి ప్రైవేటు రైల్వే స్టేషన్ మధ్యప్రదేశ్‌లో ఉంది. దీన్ని రాణీ కమలాపతి స్టేషన్ అని పిలుస్తారు. ఎయిర్‌పోర్టు స్థాయి అత్యాధునిక సౌకర్యాలతో దీన్ని తీర్చిదిద్దారు.