Share News

India Pakistan Ceasefire: కాల్పుల విరమణకు అమెరికాకు థ్యాంక్స్ చెప్తారా? విదేశాంగమంత్రి సమాధానం ఇదే..

ABN , Publish Date - May 27 , 2025 | 09:52 AM

Jaishankar On India Pakistan Ceasefire: భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కోసం కృషి చేసింది మేమే అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ సగర్వంగా ప్రకటించుకున్నారు. ఆ తర్వాత కూడా పలు సందర్భాల్లో మా వల్లే.. అంటూ పదే పదే చెప్తూ వస్తున్నారు. తాజాగా కాల్పుల విరమణకు సహకరించిన అమెరికాకు థ్యాంక్స్ చెప్తారా? అని అంతర్జాతీయ మీడియా ప్రశ్నించగా.. భారత విదేశాంగమంత్రి జై శంకర్ దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చారు.

India Pakistan Ceasefire: కాల్పుల విరమణకు అమెరికాకు థ్యాంక్స్ చెప్తారా? విదేశాంగమంత్రి సమాధానం ఇదే..
US Role In India Pakistan Ceasefire Jaishankar Reply

US Role In India Pakistan Relations: భారత్ - పాక్ కాల్పుల విరమణకు అంగీకారం తెలిపాయని అధికారిక ప్రకటన చేసింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అని అందరికీ తెలిసిందే. అమెరికా పెద్దన్నలా ఈ విషయంలో అండగా నిలబడి అణుదేశాల మధ్య యుద్ధాన్ని అరికట్టిందని అప్పటి నుంచి ట్రంప్ పదే పదే ప్రకటిస్తూ వస్తున్నారు. ట్రంప్ వాదనను భారత ప్రభుత్వం ఇప్పటికే చాలా సార్లు తిరస్కరించింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ విషయం గురించి స్పష్టత ఇచ్చారు. అయినప్పటికీ భారత అధికార ప్రతినిధులకు అంతర్జాతీయ మీడియా నుంచి మళ్లీ మళ్లీ ఒకే ప్రశ్న ఎదురవుతోంది. తాజాగా జర్మనీ పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్‌కూ.. భారత్-పాక్ కాల్పుల విరమణ విషయంలో అమెరికాకు థ్యాంక్స్ చెప్తారా? అనే ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన ఇచ్చిన సమాధానం విని ఒక్కసారిగా సైలంట్ అయ్యారు మీడియా ప్రతినిధులు.


అమెరికా చేసిందేం లేదు: జై శంకర్

జర్మన్ వార్తాపత్రికకు చెందిన ఒక జర్నలిస్ట్ భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్‌ను 'భారతదేశం, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చినందుకు ప్రపంచం అమెరికాకు కృతజ్ఞతలు చెప్పాలా?' అని అడిగారు. దీనిపై విదేశాంగ మంత్రి మాట్లాడుతూ, 'కాల్పుల విరమణ అంశాన్ని ముందుగా ప్రతిపాదించింది పాకిస్థాన్‌ డీజీఎంవో (సైనిక కార్యకలాపాల డైరెక్టర్‌ జనరల్‌)నే అని.. వారి అభ్యర్థన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నాం తప్ప అమెరికా జోక్యం అణుమాత్రం కూడా లేదని సూటిగా సమాధానమిచ్చారు. తానైతే ప్రత్యక్షంగా ఈ విషయంలో పాకిస్థాన్ తో చర్చించలేదని.. భారత్ 'ఆపరేషన్ సిందూర్'ను ఆపేయాలని పాక్ మాత్రమే అమెరికాను కోరిందని వెల్లడించారు. పాక్ నేరుగా తమతో చర్చించాలని అగ్రరాజ్యానికి చెప్పినట్లు స్పష్టం చేశారు. అదే విధంగా భారత్ తరపున డీజీఎంఓ తప్ప మరే అధికారి పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ చర్చల్లో పాల్గొనలేదని అన్నారు. మరి, కాల్పుల విరమణకు నేను ఎవరికి కృతజ్ఞతలు చెప్పాలి? అని ఎదురు ప్రశ్నించారు. ఇది కేవలం ఇరు దేశాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందం తప్ప.. అమెరికా జోక్యం లేదని మరోమారు వెల్లడించారు.


భారత్-పాకిస్థాన్ వివాదంలో చైనా పాత్ర ఉందా?

భారత్-పాకిస్థాన్ వివాదంలో చైనా పాత్ర ఉందా లేదా అనే దానిపై కూడా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ సమాధానమిచ్చారు. దాడి సందర్భంగా చైనా తయారు చేసిన ఆయుధాలను పాకిస్థాన్ సైనికులు ఉపయోగించిన విషయాన్ని మాత్రమే ప్రస్తావించారు. పాకిస్థాన్ ఆయుధ సంపత్తిలో చాలా వరకూ చైనా నుంచి సమకూర్చుకున్నవే అని తెలిపారు. 'ఆపరేషన్ సిందూర్' ద్వారా ఉగ్రదాడులకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని న్యూఢిల్లీ ఉగ్రవాదులకు స్పష్టమైన సంకేతాలు పంపిందని అన్నారు. అదే విధంగా ఇరు దేశాల మధ్య ఘర్షణ ఎప్పుడూ అణు స్థాయికి చేరుకోలేదని వివరణ ఇచ్చారు. మన ప్రపంచంలో జరిగే ప్రతి విషయం నేరుగా అణు సమస్యకు దారితీస్తుందనే కథనాలు తరచూ వ్యాప్తి చెందుతుంటాయి. అయితే, ఉగ్రవాదం వంటి భయంకరమైన కార్యకలాపాలను ప్రోత్సహించే దేశమే నన్ను ఎక్కువ కలవరపెడుతుంది" అని ఆయన అన్నారు. ప్రస్తుతం విదేశాంగ మంత్రి నెదర్లాండ్స్, డెన్మార్క్, జర్మనీ పర్యటనకు వెళ్లారు. మూడు దేశాల పర్యటనలో చివరిదైన బెర్లిన్‌లో ఉన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

Fashion Designer: ప్రతి నూలు పోగుకూ ఓ కథ..!

Gold Rates Today: పసిడి ప్రియులకు అలర్ట్.. తగ్గిన బంగారం, పెరిగిన వెండి

Read Latest National News and Telugu News

Updated Date - May 27 , 2025 | 02:05 PM