Himachal Pradesh RainFall: భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్‌లో అల్లకల్లోలం..
ABN , Publish Date - Jul 23 , 2025 | 12:55 PM
హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రుతుపవనాల కారణంగా భారీగా వర్షపాతం నమోదైంది. కొండచరియలు విరిగిపడటంతో సుమారు 383 రోడ్లను మూసేశారు.

హిమాచల్ ప్రదేశ్: హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రుతుపవనాల కారణంగా భారీగా వర్షపాతం నమోదైంది. సిమ్లాలో భారీ వర్షపాతం కారణంగా జలవిద్యుత్ ప్రాజెక్టులలో బురద పేరుకుపోయి విద్యుత్ ఉత్పత్తి భారీగా తగ్గింది. అదే సమయంలో భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటం వల్ల చాలా ప్రాంతాల్లో రోడ్లపై రద్దీ నెలకొంది. రవాణా, విద్యుత్, తాగునీటి సరఫరా విషయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొండచరియలు విరిగిపడటంతో సుమారు 383 రోడ్లను అధికారులు మూసేశారు. ఒక్క మండీ జిల్లాలోనే 251 రోడ్లను దిగ్భంధనం చేశారు.
భీకర వర్షాల కారణంగా ఈ సీజన్‌లో ఇప్పటివరకు రాష్ట్రంలో సుమారు 135 మంది మరణించారు. 224 మంది గాయపడగా.. 34 మంది గల్లంతయ్యారు. మండీ జిల్లాలో అత్యధికంగా 23 మంది మరణించగా, కాంగ్రాలో 21 మంది మరణించారు. చంబా, కులులో 15 మంది, సిమ్లాలో 11 మంది మరణించారు. ఇప్పటివరకు 397 ఇళ్ళు, 277 దుకాణాలు, 1037 గోశాలలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 797 ఇళ్ళు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మండీలో అత్యధికంగా 936 ఇళ్ళు దెబ్బతిన్నాయి. దాదాపు రూ.1247 కోట్ల ఆస్తి నష్టం సంభవించినట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది. జులై 27 నుంచి 29 వరకూ మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఇవి కూడా చదవండి
పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..
కోటా నియమాలు మార్చిన భారత రైల్వే.. ప్రయాణీకులు ఏం చేయాలంటే..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి