Share News

Weather Updates: మరో 3 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షం..

ABN , Publish Date - Jul 23 , 2025 | 12:35 PM

తెలంగాణలో మరో మూడు గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

Weather Updates: మరో 3 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షం..
Rains

తెలంగాణ: రాష్ట్రంలో మరో మూడు గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో హైదరాబాద్ నగరంతో సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు IMD ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్‌లు జారీ చేసింది.


కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లా, పెద్దపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు పేర్కొన్నారు. నిజామాబాద్, జగిత్యాల జిల్లా,భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు వెల్లడించారు.


కాగా, హైదరాబాద్‌ నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత అర్థరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరముంటే తప్ప బయటకు రావద్దని సూచించారు.


Also Read:

బండి సంజయ్, ఈటెల వివాదంపై ఎంపీ అరవింద్ షాకింగ్ రియాక్షన్

భారీ వర్షాలతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం

For More Telangana News

Updated Date - Jul 23 , 2025 | 01:27 PM