PM Modi: మోడీ అకౌంట్ ఈమె చేతుల్లోనే.. ఎవరీ వైశాలి..
ABN , Publish Date - Mar 08 , 2025 | 02:19 PM
Women's Day 2025: ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియా అకౌంట్‌ను ఓ 23 ఏళ్ల యువతి నిర్వహిస్తున్నారు. ఆయన ట్విట్టర్ ఖాతా పోస్టింగ్ తదితర బాధ్యతలు ఆమెనే చూసుకుంటున్నారు. అసలు ప్రధాని ఖాతాను అంతా తానై నడిపిస్తున్న ఆ యువతి ఎవరు.. అనేది ఇప్పుడు చూద్దాం..

ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియా అకౌంట్ బాధ్యతల్ని ఓ యువతి చూసుకుంటున్నారు. ఆయన ట్విట్టర్ ఖాతాలో పోస్టింగ్స్ రెస్పాన్సిబిలిటీని చూసుకుంటున్న ఆ యువతి వయసు 23 ఏళ్లు మాత్రమే. వణక్కం అంటూ ఆమె పెట్టిన పోస్ట్‌లు ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. కలల్ని కనడం, వాటిని సాకారం చేసుకోవడం కోసం అలుపెరగకుండా ప్రయాణం సాగించాలంటూ ఆమె ఇస్తున్న సందేశాలు అందర్నీ ఆలోచింపజేస్తున్నాయి. మరి.. ఎవరా యువతి.. ప్రధాని ఖాతాను ఆమె ఎందుకు హ్యాండిల్ చేస్తున్నారు.. అనేది ఇప్పుడు చూద్దాం..
వణక్కం..
ఇవాళ మహిళా దినోత్సవం కావడంతో నారీశక్తికి వందనం అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు ప్రధాని మోడీ. ఈ క్రమంలోనే ఆయన ఓ అరుదైన నిర్ణయం తీసుకున్నారు. తన సోషల్ మీడియా అకౌంట్లను హ్యాండిల్ చేసే బాధ్యతల్ని ఎంపిక చేసిన కొందరు స్త్రీలకు ఆయన అప్పజెప్పారు. ఈ తరుణంలోనే మోడీ ఖాతా నుంచి వణక్కం.. అంటూ ఓ పోస్ట్ వచ్చింది. ఆయన అకౌంట్ నుంచి పోస్ట్ పెట్టిన ఆ మహిళ మరెవరో కాదు.. ప్రముఖ చెస్ క్రీడాకారిణి, ఇండియన్ గ్రాండ్ చెస్ మాస్టర్ వైశాలి రమేశ్ బాబు. తాను చెస్ ప్లేయర్‌నని, దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వకారణమంటూ ఆమె పోస్ట్ చేశారు.
ప్రయాణం ఆపొద్దు..
ప్రధాని అకౌంట్‌ను నిర్వహించడం గొప్ప విషయమని.. ఇది తనకు దక్కిన అదృష్టమన్నారు వైశాలి. ఈ రోజు మొత్తం ఆయన అకౌంట్ బాధ్యతల్ని ఆమే చూసుకోనున్నారు. ఇది తనకో ఉత్తేజకరమైన ప్రయాణమని.. ఎన్ని అవరోధాలు ఎదురైనా కన్న కలల్ని సాకారం చేసుకునే దిశగా ప్రయాణం ఆపొద్దని ఓ పోస్ట్‌లో ఆమె రాసుకొచ్చారు. ఆడపిల్లలకు పేరెంట్స్‌తో పాటు తోబుట్టువులు అండగా నిలవాలని కోరారు. వాళ్ల సామర్థ్యంపై నమ్మకం ఉంచాలని రిక్వెస్ట్ చేశారు. కాగా, వైశాలితో పాటు న్యూక్లియర్ స్పేస్ సైంటిస్టులు ఎలినా మిశ్రా, శిల్పి సోని తదితర ప్రముఖులకు కూడా మోడీ అకౌంట్ నుంచి పోస్టులు పెట్టారు.
ఇవీ చదవండి:
సీఎం స్టాలిన్‌ను నాన్నా అని పిలిస్తే తప్పేంటి.
భాష గురించి అడిగితే ఈడీతో దాడులా..
మల్టీప్లెక్స్‌లోనూ రూ.200లోపే సినిమా టికెట్!
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి