MLA: ఏ పార్టీలో ఉండాలనేది ప్రజలే నిర్ణయిస్తారు
ABN , Publish Date - Jul 12 , 2025 | 12:54 PM
ఏ పార్టీలో ఉండాలనేదిగానీ, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనేదిగానీ నియోజకవర్గ ప్రజలే నిర్ణయిస్తారు కానీ పోటీ చేయడం మాత్రం తథ్యమని చాముండేశ్వరి ఎమ్మెల్యే జీటీ దేవెగౌడ స్పష్టం చేశారు. మైసూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జేడీఎస్ ఎమ్మెల్యేగా గెలిచానన్నారు. పార్టీ ప్రముఖ నేతలతో సరిపడక దూరంగా ఉన్నానన్నారు.

- ఎమ్మెల్యే జీటీ దేవెగౌడ
బెంగళూరు: ఏ పార్టీలో ఉండాలనేదిగానీ, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనేదిగానీ నియోజకవర్గ ప్రజలే నిర్ణయిస్తారు కానీ పోటీ చేయడం మాత్రం తథ్యమని చాముండేశ్వరి ఎమ్మెల్యే జీటీ దేవెగౌడ(Chamundeshwari MLA G T Devegowda) స్పష్టం చేశారు. మైసూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జేడీఎస్ ఎమ్మెల్యేగా గెలిచానన్నారు. పార్టీ ప్రముఖ నేతలతో సరిపడక దూరంగా ఉన్నానన్నారు. జేడీఎ్‌సలో కొనసాగాలా లేదా బీజేపీ, కాంగ్రెస్ లలోకి వెళ్లాలా అనేది ప్రజలు తీర్మానిస్తారన్నారు.
కాంగ్రెస్ కి రావాలని సీఎం సిద్దరామయ్య లేదా డీసీఎం డీకే శివకుమార్ పిలవలేదన్నారు. బీజేపీ నాయకులు కూడా ఆహ్వానించలేదన్నారు. జేడీఎస్ వారు ఇటీవల జరిగిన చన్నపట్టణ ఎన్నికలకు పిలవలేదన్నారు. పార్టీ ప్రణాళికా సంఘం అధ్యక్షుడినైనా ఎవరూ ఆహ్వానించలేదన్నారు. నా రాజకీయ భవిష్యత్తు కాలమే నిర్ణయిస్తుందన్నారు.
సిద్దరామయ్య లాంటి బలమైన నాయకుడిపైనే గెలిచానన్నారు. కానీ కుమారస్వామి, సురేశ్‌బాబుకు శాసనసభలో పార్టీపక్షనేత అవకాశం ఇచ్చారన్నారు. అందుకే ఎమ్మెల్యేగా నా నియోజకవర్గ పరిధిలో పనిచేస్తున్నా అన్నారు. నిఖిల్ కుమారస్వామి మూడు ఎన్నికల్లో ఓడారని, అయితే పార్టీని ముందుకు తీసుకెళ్లే సత్తా ఉందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
రోజు రోజుకు పెరుగుతున్న బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే..
తెలంగాణలో అమిత్ షా పర్యటన షెడ్యూల్ ఇదే..
Read Latest Telangana News and National News