Central Election Commission: ఈసీ కీలక నిర్ణయం.. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ..!!
ABN , Publish Date - Jul 12 , 2025 | 11:30 AM
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ చేపట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. ఆగస్టులో ఓటర్ల జాబితా సవరణని ప్రారంభించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది.

ఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై (Voter List Special Revision) కేంద్ర ఎన్నికల కమిషన్ (Central Election Commission) కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ చేపట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. ఆగస్టులో ఓటర్ల జాబితా సవరణని ప్రారంభించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. బీహార్ ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి.
ప్రత్యేక సవరణకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూనే ఈసీకి సుప్రీంకోర్టు కొన్ని సూచనలు చేసింది. బీహార్ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగే పశ్చిమబెంగాల్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లోనూ ఇదే ప్రక్రియను చేపట్టనుందని ప్రచారం జరుగుతోంది. ఎన్నికలు జరిగే రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు సిద్ధమవుతున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఆయా రాష్ట్రాల ఎన్నికల సంఘం అధికారులకు ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లు ఈసీ అధికారులు తెలిపారు. పూర్తిస్థాయి షెడ్యూల్‌ని త్వరలోనే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
గ్రామంలో రోడ్లు లేవంటూ సోషల్ మీడియాలో గర్భిణుల నిరసన.. ఎంపీ రెస్పాన్స్ చూస్తే..
ఒక్క రోజు కూడా పని చేయని కానిస్టేబుల్‌కు రూ.28 లక్షల జీతం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి