Home » Election Commission
ఎన్నికల కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను ఎలాంటి పారదర్శకత లేకుండా నిర్వహించిందని తేజస్వి యాదవ్ ఆరోపించారు. రాజకీయ పార్టీలను లూప్ నుంచి దూరంగా ఉంచి, పేద, అట్టడుగు ఓటర్లను టార్గెట్ చేసుకుని సామూహికంగా తొలగించిందన్నారు.
ఎన్నికల కమిషన్ నుంచి ఎలాంటి సహకారం లేకపోవడంతో ఓట్ల చౌర్యంపై తమ పార్టీ స్వతంత్ర విచారణ జరిపిందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తెలిపారు. ఇందుకోసం 6 నెలలు పట్టిందని చెప్పారు.
ముసాయిదా జాబితా పబ్లిష్ కావడంతో 'క్లెయిమ్స్, అబ్జెక్షన్ల' సమయం మొదలైంది. సెప్టెంబర్ 1వ తేదీ వరకు అభ్యంతరాలు, క్లెయిమ్‌లు చేసుకునేందుకు గడువు విధించారు. తమ పేర్లు పొరపాటున జాబితాలో చోటుచేసుకోని పక్షంలో దానిని సరిచేయాల్సిందిగా అధికారులను ఓటర్లు సంప్రదించవచ్చు.
భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్, కౌంటింగ్ ఉండనున్నట్లు తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 3 ఎంపీటీసీ 2 జడ్పీటీసీ, 2 సర్పంచ్ స్థానాల ఎన్నికలకు ఇవాళ (జులై 28)నోటిఫికేషన్ జారీ అయింది. దీంతో రామకుప్పం, కారంపూడి, విడవలూరు ఎంపీటీసీ ఎన్నికలు..
జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా నేపథ్యంలో.. ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియను ప్రారంభించినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది.
ముసాయిదా ఓటర్ల జాబితాలో ఏదైనా పొరపాట్లు ఉంటే ఓటర్లు కానీ, రాజకీయ పార్టీలు కానీ తమ అసెంబ్లీ నియోజకవర్గంలోని సంబంధిత ఈఆరోఓ (ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్)ను కానీ, ఏఈఆర్ఓ (అస్టిస్టెంట్ ఈఆర్ఓ)వద్ద కానీ తమ అభ్యంతరాన్ని దాఖలు చేయవద్దని ఈసీ తెలిపింది.
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజ్యాంగ బాధ్యతగా ఎస్ఐఆర్‌ను నిర్వహిస్తున్నామని ఈసీ తెలింది. ఎస్ఐఆర్‌పై ఈసీ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం కోర్టు పరిశీలనలో ఉండగా, తాము చేపట్టిన ప్రక్రియ చట్టబద్ధమని, రాజ్యాంగంలోని 324వ నిబంధనకు లోబడి ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఎన్నికల కమిషన్ చెబుతోంది.
బిహార్లో ఎన్నికల కమిషన్ ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఐఎస్ఆర్ కారణంగా 35.5 లక్షల మంది పేర్లను తొలగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
బిహార్లో మాదిరిగా దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత తనిఖీ చేపట్టాలని ఎన్నికల కమిషన్ ఈసీ నిర్ణయించింది.